Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్స్ లో చక్కటి రేటింగ్ తో.. వీక్షకులను అలరిస్తున్న సీరియల్స్‌లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కూడా ఒకటి..! 600 ఎపిసోడ్స్ కు దగ్గరవుతున్న ఈ సీరియల్ సరికొత్త కథనంతో ఊహించని మలుపులతో చూపు తిప్పుకోనివ్వడంలేదు..! ఈ సీరియల్ లో వచ్చేవారం ఏం జరిగనుందంటే.!?
ప్రేమ్ ను ఇంట్లో నుంచి పంపించేసి తులసి ఎవరు ఊహించని ట్విస్ట్ ఇస్తుంది. అది కూడా తన మంచి కోసమేనని.. ఇంట్లో ఉంటే బంధాలు, ఆప్యాయతలు అంటూ తన కెరీర్ ను పక్కన పెట్టేస్తున్నాడని.. అందుకోసమే తనని ఇంట్లో నుంచి వెళ్ళిపొమ్మని చేప్పానని వాళ్ళ మావయ్య తో చెబుతుంది . ప్రేమ్ ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో దివ్య పెద్ద యుద్ధమే చేస్తోంది. తులసి పై దివ్య చేసే రాద్ధాంతం అంతా ఇంతా కాదు రాసి కూడా దివ్య రెచ్చగొట్టడానికి తులసి మీద లేనిపోనివి చెబుతూ ఉంటుంది మొత్తానికే అది కాస్త చిలికి గాలివానలా మారి పెద్ద తుఫాను అవుతుంది.
ప్రేమ్ ని ఇంట్లో నుంచి తులసి బయటికి పంపితే.. దివ్య ను కూడా తులసి కి దూరం చేయాలని లాస్య క్రిమినల్ ప్లాన్. తన పథకం అమలు చేయడానికి తులసి ఊహించని ప్రణాళికలు రచిస్తోంది లాస్య దెబ్బలకు తులసి తట్టుకొని నిలబడిన.. దివ్య మాటలతో తన మనసును ఇంకా విరిచేస్తుంది. ఇక ప్రేమ్ ఎలా ఉన్నాడో అని బాధ పడుతున్నా తులసికి ప్రేమ్ ఎదురుపడతాడు. ప్రేమ బర్త్‌డే రావడంతో శృతి ప్రేమను సర్ ప్రైజ్ చేస్తుంది. ఆ సర్ ప్రైజ్ చూసిన ప్రేమ్ గతంలోకి వెళతాడు. పోయిన సంవత్సరం నా బర్త్ డే సెలబ్రేషన్స్ ఇంట్లో వాళ్ళందరూ బాగా చేశారు. నన్ను బాగా ఆటపట్టించి చివర్లో సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రేమ్ కి తులసి బర్త్ డే గిఫ్ట్ గా గిటార్ ఇచ్చి.. తనని గొప్ప సింగర్ గా చూడాలని దీవిస్తుంది.
కానీ ప్రేమ్ వాళ్ళ అమ్మ ఇచ్చిన మాటను మర్చిపోయి.. సింగర్ అవ్వాలన్నా తన కోరికను పక్కన పెట్టి.. ఆశలు ఉన్నా గాని వాస్తవంలో బ్రతకాలి అంటే డబ్బులు కావాలని.. అందుకోసం ఆటో నడపాలని.. శృతి కి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇక రాములమ్మ సహాయం తీసుకుని ఒక కొత్త ఆటోలు అద్దెకి తీసుకుని నడుపుతాడు. ఈ విషయం తెలుసుకున్న శృతి ఆటో నడపకుండా అడ్డుపడుతుందా.. లేదంటే తనకు అండగా నిలుస్తుందో చూడాలి. ప్రేమ్ ఆటో నడుపుతున్నాడని తెలుసుకున్న తులసి ఆనందంతో పొంగిపోతుంది.. ఎందుకో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.