28.2 C
Hyderabad
December 6, 2022
NewOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సండే స్పెషల్ స్టోరీ..!! వచ్చేవారం జరిగేది ఇదేనా..!?

Share

Intinti Gruhalakshmi: మాటీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ లో టాప్ రేటింగ్ లో మొన్నటి వరకు కార్తీక దీపం ముందుంటే.. ఇంటింటి గృహలక్ష్మి దాన్ని బీట్ చేసి టాప్ రేటింగ్ తో పరుగులు పెడుతోంది.. మొత్తానికి పాత చింతకాయ పచ్చడి రుచి అన్నట్టు.. లాస్య మోజులో ఉన్నప్పుడు గుర్తుకురానీ భార్య.. అదేంటో లాస్యను పెళ్ళిచేసుకున్న తర్వాత నందు తులసి విలువ తెలుసుకుని తన చుట్టే తిరుగుతున్నాడు..!! అప్పటి వరకు అమాయకపు గృహిణిగా చూపిస్తూ వచ్చిన తులసి లో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి పరిచయం చేశారు దర్శకులు.. పెళ్లి కాక ముందు వరకు ప్లాప్ ప్లాన్స్ తెలియని లాస్య కు పెళ్లి అయ్యాక ప్లాప్ అంటే ఏంటో రుచి చూపించారు.. ఇవన్నీ వీక్షకులకు ప్లస్ పాయింట్స్ కావడంతో సీరియల్ రేటింగ్ ను అమాంతం ఆకాశానికి ఎత్తేశారు..!! ఈ వారం జరిగిన ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్.. వచ్చేవారం హైలైట్స్ ఒకసారి చూసేద్దామా..!!

Intinti Gruhalakshmi: serial Next Week Episodes overview
Intinti Gruhalakshmi: serial Next Week Episodes overview

అప్పటి వరకు ఓటమి రుచి తెలియని లాస్య కు పెళ్లయ్యాక మొదటి సారి ధాన్య లక్ష్మి పూజ చేయడానికి నానాతంటాలు పడి గాయత్రి నీ రంగంలోకి దింపి.. తను అనుకున్నది సాధించింది అనేలోపు తనకు ఎంతో ఇష్టమైన తన భర్త నందు తో ఒడిపోయెలా చేస్తారు నిర్మాతలు. అప్పటి వరకు లాస్య హిట్ తప్ప ఫట్ తెలియక పోవడంతో నందు నీ చెడామడా వాయించేస్తుంది.. ఇద్దరి మధ్య పెళ్లి బంధం తెగిపోయి విడిపోతారు అనుకునే సమయంలో లాస్య నే తగ్గి నందును కూల్ చేస్తుంది.. ఇక నందు తో పెళ్ళి తరువాత ఎంజాయ్ చేసే రోజు రావడంతో ఇద్దరు పబ్ కి వెళ్లి ఫుల్ గా తాగేసి వస్తారు.. ఇక ఇంట్లో వాళ్లకు వీళ్ళు తాగివచ్చిన విషయం తెలియకుండా తులసి మేనేజ్ చేస్తుంది.. తెల్లారాక వీళ్ళు చేసిన బాగోతానికి క్లాస్ పీకితే నందు సారీ తులసి ఇలా ఇంకెప్పుడూ చేయను అనడంతో ఆడియెన్స్ లో మంచి ర్యాపో క్రియేట్ చేశారు దర్శకులు.. ఇలాంటి సీన్స్ తో ప్రేక్షకులను టీవీ నుంచి కదలనివ్వకుండా చేస్తుంది..

Read More: Devatha Serial: దేవత సీరియల్ ఆదివారం స్పెషల్.. వచ్చేవారంలో ఇన్ని ట్విస్టులు ఉన్నాయా..!?

ఇప్పటివరకు తులసిలో అమాయకత్వం, జాలి, ప్రేమ, కరుణ చూసిన ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా.. తనను కొత్త కోణంలో కటినమైన నిర్ణయాలు తీసుకునే తులసిలా మార్చి చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు.. అభి మాట్లాడిన మాటలకు తన జీతం ఇంట్లో ఇస్తేనే తన బాధ్యత తీసుకుంటానని లేదంటే ఎవరి దారి వారిదే అని చెప్పి.. అభికి తన స్థాయిని గుర్తుచేసి అమ్మ విలువ తెలిసేలా చేస్తుంది. తులసి ఇలా నిర్ణయం తీసుకోవడానికి ఓ రకంగా అంకిత వాళ్ళ అమ్మ కారణమైన అవేమీ పట్టించుకోకుండా.. అంకిత ను తను చదువుకున్న చదువుకు సార్థకత రావాలని.. తనని కూడా అభిలా జూనియర్ డాక్టర్ లా చూడాలని చెబుతుంది.. ఇక అంకిత రేపే ఇంటర్వ్యూ కి వెళ్తుంది. అంకిత వాళ్ళ అత్తయ్యకు ఇచ్చిన మాట ప్రకారం జూనియర్ డాక్టర్ గా జాబ్ తెచ్చుకునేలా ఉంది. ఇక అభి వాళ్ల అత్తయ్య మాధవి నీ బుట్టలో వేసుకుని లక్ష రూపాయలు తీసుకున్నాడని లాస్య ద్వారా నిజం తెలిస్తే.. అభి మీద తులసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో రానున్న ఎపిసోడ్స్ లో చూద్దాం..

Intinti Gruhalakshmi: serial Next Week Episodes overview
Intinti Gruhalakshmi: serial Next Week Episodes overview

మన పిల్లలు.. అదే నీ పిలల్లు.. గొప్ప తల్లి కడుపున పుట్టారని నందు తులసి తో పాజిటివ్ గా మాట్లాడుతుండగా.. సరిగ్గా అదే సమయానికి లాస్య వచ్చి తన భర్త చేజారిపోయేలా ఉన్నడని తెలుసుకుని.. తులసి పై నిష్టూరంగా మాట్లాడుతుంది.. ఇక లాస్య సూటి పోటి మాటలు గురించి ప్రత్యేకంగా చెప్పనవరంలేదు. ఇక నందు ఈ గొడవను సాగదిస్తాడా..‌లాస్య నేతలను మాజీ భార్య భర్తలు వింటూ ఉండిపోతారు అని తెలుసుకోవాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.


Share

Related posts

Liz Truss: బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా

somaraju sharma

బిగ్ బాస్ 4 : వారినీ అందుకోసమా మొనల్ వెనక అభిజిత్ – అఖిల్ అంతలా పడుతున్నారు.

GRK

18 భారీ సెట్స్‌…

Siva Prasad