ట్రెండింగ్ సినిమా

Intinti Gruhalakshmi: టిఆర్పి రేటింగ్ లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఏంటి ఇంత దారుణంగా పడిపోయింది..!?

Share

Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ కు విశేష స్పందన దక్కుతున్న సంగతి తెలిసిందే.. టెలివిజన్లో ప్రసారమవుతున్న ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారమవుతున్నాయి.. అటువంటివాటిలో ఇంటింటి గృహలక్ష్మి కూడా ఒకటి.. ఈ సీరియల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. అయినప్పటికీ ఈ వారం టిఆర్పి రేటింగ్ లో ఇంటింటి గృహలక్ష్మి బోల్తాపడింది.. గత వారం రెండో స్థానంలో నిలిచినప్పటికీ.. ఈ వారం ఎన్నడూ లేని విధంగా 4వ స్థానానికి పడిపోయింది..! కార్తీకదీపం సీరియల్ కు గట్టి పోటీ ఇస్తున్న ఇంటింటి గృహలక్ష్మి ఈ వారం మొదటి స్థానంలో నిలుస్తుందనుకుంటే.. దారుణంగా నాలుగవ పొజిషన్ లో నిలబడింది..! ఇంటింటి గృహలక్ష్మి 8.93 రేటింగ్ ను నమోదు చేసుకుంది.. ఈ రేటింగ్ పడిపోవడానికి గల కారణాలేమిటో ఇప్పుడు చూద్దాం..!!

Intinti Gruhalakshmi: Serial These Week TRP Rating Down because
Intinti Gruhalakshmi: Serial These Week TRP Rating Down because

వాస్తవానికి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈ వారం మొత్తం కాస్త చప్ప చప్పగానే సాగింది.. తులసి గృహలక్ష్మి పాటలు చాలా ఒద్దికగా ఒదిగి పోయింది. ఎన్నో కష్టాలను అనుభవించిన తరువాత వాటన్నిటినీ తొలగించుకుంటూ.. ధైర్యంగా సమాజంలో ముందుకు వెళుతుంది. తులసి పాత్రలో సరికొత్త హంగులు జోడించడానికి ప్రవళిక అనే కొత్త క్యారెక్టర్ ను రంగంలోకి దించారు.. ప్రవళిక తో తులసి జాగింగ్ కి వెళ్ళడం ఎన్నడూలేని విధంగా తన డ్రెస్సింగ్ స్టైల్ మారడం.. ఆ విషయంలో నందు తనని కామెంట్ చేయబోగా.. తులసి నందుకి రివర్స్ గేర్ బాగానే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.. అయినప్పటికీ తులసి లో వచ్చిన మార్పులను వీక్షకులు సాదరంగా ఆహ్వానించే లేదేమో అనిపిస్తుంది టిఆర్పి రేటింగ్ చూస్తుంటే..

Intinti Gruhalakshmi: Serial These Week TRP Rating Down because
Intinti Gruhalakshmi: Serial These Week TRP Rating Down because

సీరియల్ పై హైప్ క్రియేట్ చేయడానికి ప్రవళికను కలెక్టర్ పొజిషన్లో నుంచి తులసి గొప్పతనాన్ని అందరికీ తెలిసేలా ప్రవళిక చేస్తుంది మదర్ తెరిసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాతృ దినోత్సవం కాంటెస్ట్ లో తులసి బెస్ట్ మదర్ అవార్డుకు ఎంపిక చేస్తారు . తన పిల్లల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన ఆమెకు బెస్ట్ అవార్డు ఎలా ఇస్తారు అంటూ కాంటెస్ట్ లో పాల్గొన్న మిగతావారు ప్రశ్నించడంతో.. ఆ ప్రశ్నలకు బదులు ఇవ్వడానికి ప్రవళిక రంగంలోకి దిగుతుంది ఓ సాధారణమైన మనిషి చెబితే ఎవ్వరూ వినరని తెలుసుకున్న ప్రవళిక.. తను ఎవరో అందరికీ తెలియజేయడంతో పాటు తన నోటి ద్వారా తులసి గొప్పతనాన్ని తెలియజేస్తే.. అందరికీ తన మంచితనం ఏంటో అర్థం అవుతుందని తెలుసుకున్న ప్రవళిక.. సీన్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. మరోవైపు లాస్య కొడుకు లక్కీ కి కూడా తులసి అంటే అమితమైన ప్రేమ.. సవతి కొడుకుని కూడా తన సొంత కొడుకుగా భావించిన తులసి మంచితనాన్ని ప్రవళిక స్పీచ్ తో ఆకాశానికి తీసుకెళ్తుంది..


Share

Related posts

Vishwak Sen: గెటవుట్ అంటూ స్టూడియో నుండి హీరో విశ్వక్ సేన్ నీ పంపేసిన టాప్ యాంకర్..!!

sekhar

`సాహో` రొమాన్స్‌ ఫోటో లీక్‌డ్‌

Siva Prasad

Pooja Hegde: ప్రియ‌మైన వాడితో మాల్దీవ్స్‌లో చిల్ అవుతున్న పూజా హెగ్డే.. ఫొటోలు వైర‌ల్‌!

kavya N