Intinti Gruhalakshmi: లాస్య ఆశలపై నీళ్లు చల్లిన నందు..! వసంత పై తులసి ఫైర్..!!

Share

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ రోజుకో మలుపు తిప్పుతూ.. కొత్త కొత్త ట్విస్టులతో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.. అంతేకాకుండా టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది.. ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న నేటి ఎపిసోడ్ హైలెట్స్ పై ఓ లుక్కేయండి..!!

Intinti Gruhalakshmi: Serial Today Episode Highlights
Intinti Gruhalakshmi: Serial Today Episode Highlights

మొత్తానికి లాస్య వల్ల నిజం తెలుసుకున్న తులసి శృతి ప్రేమ్ లకు శోభనం చేయడానికి ఏర్పాట్లు చేయిస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ శృతిని ఆటపట్టిస్తూ నడి చేస్తారు మరోవైపు పూజ ఒక్కసారి పెళ్లి చేసుకొని రెండోసారి శోభనం అంటూ ఆటపట్టిస్తూ.. చేతిలో పాల గ్లాస్ పెట్టి ఆల్ ద బెస్ట్ చెప్పుతుంది. వాళ్ళ నానమ్మ మీ కోసం కుంకుమపువ్వు కొన్ని పెట్టాను త్వరలో నా ఆశ నెరవేర్చడంటూ కొత్త టాస్క్ ఇస్తుంది.. మొత్తానికి రూమ్ లో కి వెళ్ళిన శృతి ప్రేమ్ దగ్గర ఫోజ్ కొట్టడానికి ట్రై చేస్తుంది. ఈ ప్రేమ్ దగ్గర అలాంటి పప్పులు ఏమి కుదరవని.. ప్రేమ్ కూడా బెట్టుగా ఉంటాడు.. ఎట్టకేలకు శృతియే తగ్గి ప్రేమ్ దగ్గరకు వెళ్తుంది. దగ్గరకు వచ్చిన ప్రేమ్ కి వేడి పాల గ్లాస్ తో చురక వేస్తుంది. రెండోసారి శోభనం కదా మనకి ఈ పాలగ్లాసు అచ్చి రాదు అంటూ పక్కన పెట్టేస్తాడు ప్రేమ్.. ఇలా అందరినీ కాసేపు రొమాంటిక్ మూడ్ లోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించిన డైరెక్టర్ అట్టర్ ప్లాప్ అవుతాడు..

 

ఇక నిన్న వసంత చెప్పినట్టు తన అందాన్ని దాచుకో కూడదని.. లాస్య నందు కి తన అందాన్ని చూపించడానికి ప్రయత్నిస్తుంది.. నందు నీ తన దారికి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది.. నందు నువ్వు ఎందుకు నా వైపు చూడటం లేదు.. చూశాను అనుకో.. నువ్వు ఏదో ఒకటి అంటావ్.. అది నాకు నచ్చదు.. నేను ఏదో అంటాను అది నీకు నచ్చదు. మాట మాట అనుకుంటాం .. అది ఇంట్లో వాళ్లకు నచ్చదు. అవసరమా ఇదంతా అంటూ లాస్యను ప్రశ్నిస్తాడు నందు.. నందుని తన వైపు తిప్పుకోవడానికి లాస్య చాలా ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నిస్తోంది.. లాస్య మాటలను అర్థం చేసుకొని నీ యవ్వారం ఏదో తేడాగా ఉంది అనుకుంటాడు. లాస్య మాటల్లో అర్థం చేసుకున్న నందు సడెన్ గాని లో ఈ మార్పు ఏంటి.. కాంప్రమైజ్ అవుతున్నావా.. నీకోసం నాలుగడుగులు ముందుకు వేసాను నా కోసం ఒక్క అడుగు ముందుకు రాలేవా అంటూ లాస్య ప్రశ్నిస్తుంది.. నువ్వు ప్రేమతో ముందుకు వచ్చాను అనిపించడం లేదు ఆ భద్రతతో వచ్చావు అనిపిస్తుంది.. అభద్రత నాకా.. తులసి వలన అని నందు అంటాడు. కళ్ళు మూసుకుని పడుకుని ఆలోచించు నీకే అర్థం అవుతుంది అని.. నేను రేపు ఎర్లీగా లేగవాలి. ఫస్ట్ డే కదా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నాను అంటూ నందు అటువైపు తిరిగి నిద్రపోతాడు.. ఎట్టకేలకు లాస్య చేసిన ప్రయత్నాలు ఫలించవు..

Intinti Gruhalakshmi: Serial Today Episode Highlights
Intinti Gruhalakshmi: Serial Today Episode Highlights

గురక పెట్టి నిద్ర పోతున్న వసంత ను లేపడానికి వాళ్ళ ఇద్దరి మధ్య జరిగే సంభాషణలు హాస్యాన్ని పండిస్తాయి. పైగా వసంత అనే మాటలు కాస్త ఇబ్బందికరంగానే అనిపిస్తాయి. తులసి ఈ గొడవకు పుల్ స్టాప్ పెట్టి తన రూమ్ లో పడుకోమని చెబుతుంది. వసంత మళ్లీ వెళ్లి హాల్లో నిద్రపోతుంది. ఈసారి వసంత హాల్లో నిద్రపోవడం చూసిన అనసూయమ్మ తన ఉగ్ర రూపాన్ని చూపిస్తుంది. దాం తో వసంత కూడా బాగానే భారీ డైలాగ్స్ వేస్తుంది. అది చూసిన తులసి వాళ్ళని అపే ప్రయత్నంలో ఉండగా.. అంతలో లాస్య రావడం వసంత అనసూయమ్మ తులసి లపై చాడీలు చెప్పడం.. లాస్య దొరికినదే సందు అనుకొని చెడామడా నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది.. లాస్య మాటలకు తులసి ఎలాంటి సమాధానం ఇస్తుంది.. వీరిద్దరి గొడవలో నందు బలి కానున్నాడా.. మరో ప్రపంచ యుద్ధం జరిగిద్దా .. తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.


Share

Related posts

Shilpa Shetty Beautiful Looks

Gallery Desk

టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి

Mahesh

బ్రేకింగ్: అధిక బిల్లులు వేసిన ఆసుపత్రులపై చర్యలు ఏవీ? ప్రభుత్వానికి హైకోర్టు ఝలక్

Vihari