Intinti Gruhalakshmi: ప్రేమ్ మోసం చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న తులసి.. ఏం చేసిందంటే..!?

Share

Intinti Gruhalakshmi: టీవీలో ప్రసారమయ్యే ధారావాహికలకు కొదవేలేదు.. అయినప్పటికీ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. కాన్సెప్ట్ పాతదే అయిన విభిన్న కోణాలను పరిచయం చేస్తూ అందరినీ అలరిస్తుంది ఇంటింటి గృహలక్ష్మి సీరియల్.. నేడు ప్రసారం కానున్న 528వ ఎపిసోడ్ పూర్తి విశేషాలు ఒకసారి చూద్దాం..!!

Intinti Gruhalakshmi: Today 528 Episode
Intinti Gruhalakshmi: Today 528 Episode

తులసి తన అత్తయ్యకు కాళ్లు నొప్పులు సేవలు చేస్తూ ఉంటుంది అంతలో లాస్య అలిసిపోయాను అంటూ వాళ్ళ అత్త ముందే కాళ్లు కూర్చుంటుంది.. తులసి వాళ్ళ అత్తయ్య ఒకరిమీద ఒకరు పంచులు వేసుకుంటూ ఉండగా.. వసంత టీ పట్టుకుని సైలెంట్ గా నిల్చుని ఉంటుంది.. ఎంతసేపటికి మాట్లాడకపోవటంతో ఏమైంది వసంత..!? వీళ్ళు ఏమైనా నిన్ను అన్నారా..!? అది కాదు నేను చెబుతాను అంటూ వాళ్ళ అత్తయ్య నిన్న వసంత చేసిన తతంగం మొత్తం పూస గుచ్చినట్లు చెబుతుంది.. అసలే హైఫై వసంత తను ఊరుకుంటుందా.. సార్ భోజనం చేయలేదు.. తులసి మేడం చేసిన వంట తిన్నాడని చెబుతుంది.. దాంతో మరోసారి నిప్పు రాల్చుకుంటుంది.. ఆసియా తులసి మీద ఫైర్ అవుతుండగా తులసి కాదు నేను నా కొడుకుకి పెట్టాను అని అనసూయమ్మ తగులుకుంటుంది.. అత్త అని భయం ఉంటేనే గా భయపడి వెనక్కి తగ్గడానికి గొడవ జరగకుండా ఉండటానికి.. లాస్య దగ్గర అలాంటి పప్పులేమీ ఉడకవు.. దాంతో మళ్ళీ రచ్చ మొదలైంది.. ఒకరిమీద ఒకరు ఫైర్ అవుతారు.. అలసిపోయిన లాస్య వెళ్ళిపోగానే.. అనసూయ అమ్మా నువ్వు నా కోడలిగా దొరకడం ఎన్నో పూజలు చేస్తే కానీ దొరకవు అంటూ సెంటిమెంట్ డైలాగులు పండిస్తుంది..!

కట్ చేస్తే.. నందు లాస్య కి జాబ్ వచ్చిన సంగతి చెబుతాడు అయితే ఆ స్టార్టప్ కంపెనీ లోనే కదా అని లైట్ తీసుకుంటుంది కాదు మరో కంపెనీలో అని చెప్పడంతో ఎగురుకుంటూ నందు దగ్గరికి వస్తుంది.. తన ఫ్రెండ్ కే ఫెలో మేనేజర్ అని చెప్పి నందు చెప్పడంతో లాస్య ఆనందం కాసేపు కూడా నిలవదు.. పైగా నువ్వు ఒక కేఫ్ లో వర్క్ చేస్తున్నావ్ అని మా ఫ్రెండ్స్ కి ఎలా పరిచయం చేయాలి నాకు చాలా చీప్ గా ఉంటుంది వెంటనే ఆ జాబ్ రిజెక్ట్ చేసేయ్ అని చెబుతుంది ఈ కలికాలంలో ఇలాంటి భార్యలే ఉంటారని తెలుసుకోండి.. మరీ విడ్డూరం కాకపోతే.. కాస్త పెద్ద పెత్తనం ఇచ్చాడు కదా అని తను ఏ జాబ్ చేయాలో కూడా తనే డిసైడ్ చేసే విధానం చూస్తుంటే లాస్య పై ఒక్కోసారి చిరాకు తెప్పిస్తుంది చూసే అందరికీ.. ఎప్పుడు సైలెంట్ గా ఉండే నందు.. నేను నిన్ను నిర్ణయం అడగటం లేదు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే అంటాడు.. ఒక్క విషయం గుర్తు పెట్టుకో లాస్య నాకు కరెక్ట్ అనిపించిందే నేను చేస్తాను అర్థమైందా అంటూ స్ట్రాంగ్గా చెప్పేస్తాడు. అంతలో వసంత వచ్చీ టీ సార్ అనడంతో.. వెళ్లి హాల్ లో పెట్టు మా ఫ్యామిలీతో టీ తాగుతాను అనేసి అక్కడనుంచి వెళ్ళి పోతాడు.. మొదట నందు ప్రెస్ స్టేషన్ చూసిన లాస్య ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతుంది నందు బిహేవియర్ చూస్తుంటే ఇకనుంచి లాస్య నోరు గట్టిగానే అన్నాడు అదే జరిగితే సీరియల్ పై మంచి హైప్ క్రియేట్ అవ్వడంతో పాటు ఇంట్రెస్ట్ ను కూడా కలిగిస్తుంది..

Intinti Gruhalakshmi: Today 528 Episode
Intinti Gruhalakshmi: Today 528 Episode

మరో వైపు నందు వాళ్ళ నాన్న తన మీద ప్రేమ తో కూడిన భయాన్ని తులసి దగ్గర చెబుతాడు. తులసి వీటన్నింటికీ నేను ఉన్నాను అంటూ భరోసా ఇస్తుంది. మరోవైపు శృతి పొద్దున ఇంట్లో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకొని ఆలోచనల్లో మునిగిపొగా.. ప్రేమ్ వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకుంటాడు. అయినా మన మీద ఎవరికీ డౌట్ రాదులే.. మన గురించి ఎవరు పట్టించుకుంటారు.. మనం పేరుకే భార్యాభర్తలు ఎలా ఉంటున్నాము కాపురం చెయ్యట్లేదు అని ఎవరికి తెలియదులే అని మాట్లాడుకుంటుండగా లాస్య ఓ పక్క నుంచి గమనిస్తూ ఉంటుంది.. ఈ విషయం విన్న లాస్య బుర్రలోకి ఓ క్రియేటివ్ ఐడియా వచ్చేసింది.. దానిని ఎలా ఎప్పుడు ఏ విధంగా అమలు చేస్తుందో..!? తులసి ప్రేమ్ శృతి అని గట్టిగా పిలిచి.. ప్రేమ్ నీ నన్ను ఎందుకు మోసం చేశావ్.. అని ఒక్కటి పికుతుంది.. ప్రేమ శృతి లా విషయం లాస్య తులసి కి చెప్పేస్తుందా..!? మరేదైనా కారణం ఉందా..!? లేదా తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..!!


Share

Related posts

కస్టమర్లకు అలాంటి ఆఫర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ… కారణం ఏమిటంటే?

Teja

మందులో మతలబు ఉందా?? జగన్ సర్కారు సర్కస్ ఎందుకు??

Special Bureau

బిగ్ బాస్ 4: ఈసారి ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు…??

sekhar