Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 531 వ ఎపిసోడ్ పూర్తి చేసుకొని.. నేడు 532 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది.. మరో 500 ఎపిసోడ్లు ఈ సీరియల్ కొనసాగించినా కూడా.. ప్రేక్షకులు ఈ సీరియల్ ను ఆదరిస్తారనడం లో ఎటువంటి సందేహం లేదు..!! నేడు ప్రసారం కానున్న 532 వ ఎపిసోడ్ హైలెట్స్ ఓసారి చూసేయండి..!

రెగ్యులర్ చెకప్ కోసమని డాక్టర్ ను కలిసిన తులసి తన ఆరోగ్యం బాగానే ఉందని అనుకుంటుంది. కానీ డాక్టర్ చెప్పిన విషయం విని ఒక్క సారిగా తులసి ఖంగుతింది.. క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనది. దానిని మనం ఎంత వద్దు వద్దు అన్న అది మన మీద ప్రేమ చూపిస్తూ ఎక్కడికి వెళ్ళకుండా మనతోనే ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మీకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ముందు ముందు వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయని డాక్టర్ చెబుతుంది. ఒకవేళ రాకపోవచ్చు కూడా కానీ జాగ్రత్తగా ఉండటం మంచిదని సలహా ఇస్తుంది. దాంతో ఈ విషయం మా ఇంట్లో వాళ్లకి చెప్పవద్దు అని రిక్వెస్ట్ చేస్తుంది.
ఇక ఇదే ఆలోచనల్లోన్న తులసి.. ఇంటిలోకి వస్తూనే టీ పొడి అయిపోయిందని వాళ్ళ అత్తయ్య వాళ్ళ మామ తో చెప్పడం వింటుంది. ఇంట్లో ఏమైపోయాయో చూసుకోలేవా అని అనడంతో.. ఈ ఇంట్లో ఏం కావాలన్నా తులసి చూసుకుంటుంది. ఇంటి మహారాణి తులసి కదా.. అని వాళ్లు మాట్లాడుకోవడం వింటుంది తులసి. అంతలో అభి అంకిత కలిసి గొడవపడటం.. ఎంతకాలమని అత్తయ్య మీద ఆధారపడి ఉండటం అని అంకిత అనడం.. మరో వైపు శృతి ప్రేమ్ ను జాబ్ కోసం దూరంగా ఉన్న వేరే చోట కి వెళ్ళమని చెప్పడం.. ప్రేమ్ అమ్మను వదిలి పెట్టి నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పటం.. ఇక చివరిగా దివ్య చదువుకోకుండా డాన్స్ చేయడం తన రూమ్ సర్ధుకోకుండా , కాఫీ తాగిన కప్పు పక్కన పెట్టేసి ఉంటే తియ్యమని చెప్పగా.. నువ్వు ఉండగా ఇలాంటివన్నీ నేను ఎందుకు చెయ్యడం.. నువ్వు చేస్తావ్ గా నాకు అని దివ్య అనడంతో.. ఇలా అందరూ తన మీద డిపెండ్ అయి ఉన్నారని తులసి తెలుసుకుంటుంది..
మరోవైపు ఈరోజు కొత్త జాబ్ లో జాయిన్ అయినా నందు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కేఫ్ ను జాగ్రత్త గా మేనేజ్ చేస్తాడు . అంతలో కేఫ్ లోకి వచ్చిన కస్టమర్స్ కాఫీ ఆర్డర్ ఇచ్చి కావాలని కోల్డ్ కాఫీ ఆర్డర్ ఇచ్చామని అక్కడ బాయ్ తో గొడవ పడుతుంటే.. నందు నే వాళ్ళకి సారీ చెప్పి 5 నిమిషాల్లో మీకు కోల్డ్ కాఫీ వస్తుందని చెప్పి కస్టమర్స్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. తరువాత వర్కర్ తో వాళ్ళు అలాగే ఉంటారు మనమే జాగ్రత్తగా మసలుకోవాలని చెబుతాడు. కూల్ కూల్ నందు అంటూ తనని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఇలా తన మొదటి రోజు ఆఫీస్ ముగిస్తాడు.
తన మీద ఇంట్లో వాళ్ళందరూ ఆధారపడి ఉన్నారు అని తెలుసుకున్న తులసి.. ఇక నేను లేకుండా ఉండటాన్ని కూడా వీళ్ళందరికీ ఇప్పటి నుంచే అలవాటు చేయాలి అని నిర్ణయం తీసుకుంటుంది. మరి ఎలా అందరితో మేనేజ్ చేస్తుంది..!? ఎలా ఈ ప్లాన్ ను అమలు చేస్తుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..