Intinti Gruhalakshmi: బుల్లితెర ప్రేక్షకులను టీవీ లకు కట్టిపడేస్తున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి కూడా ఒకటి.. ఇంట్లో నుంచి వసంత వెళ్లిపోయినప్పట్టికి.. లాస్య కు అందరిని మచ్చిక చేసుకోమని వసంత ఇచ్చిన ఐడియా మాత్రం వర్కౌట్ చేయడానికి ప్రణాళికలు వేస్తోంది లాస్య.. ఈరోజు అది పనిలో ఉంది. నేటి 534 వ ఎపిసోడ్ లో హైలెట్స్ ఇలా ఉన్నాయి..!!
లాప్టాప్ లో తన వర్క్ చేసుకుంటున్న లాస్య అటుగా వెళ్తున్న శృతి ని ఏయ్ నిన్నే ఏయ్ నిన్నే అంటూ పిలవడంతో.. వెంటనే నా పేరు శృతి అని చెప్పగానే శృతి అనాలా లేదంటే శృతి గారు అని పిలవాలని లాస్య వెటకారంగా మాట్లాడుతుంది. దాంతో కాలిన శృతి నేను మీకు మొదటి నుంచి చెబుతుంది ఒకటే.. కాస్త గౌరవంగా పిలవండి అని చెబుతున్నాను అని అక్కడి నుంచి వెళ్లిపోగా.. లాస్య మళ్లీ కదిలిస్తుంది. పని ఏంటో చెప్పండి అని అంటుంది ఏంటో చెప్పకపోతే మాట్లాడవా అని అనగా అర్థం లేని ప్రశ్నలకు అర్థం దొరికే సమాధానాలు ఉండవు అని చెబుతుంది. ఇలా వాదోపవాదాలు జరిగే అది కాస్త తులసి ప్రస్తావనకు దారితీస్తుంది. ఆ మాటలు కోటలు దాటి నందు దగ్గరకు వచ్చే ఆగుతాయి. ఇక ఆ సంభాషణలలో లాస్య లు మీరు ఎప్పటికీ నా అత్తయ్య కాలేరు నా అత్తయ్య ఎప్పటికీ తులసి మాత్రమే నువ్వు వాస్తవంలో లేనట్టు ఉన్నావు ప్రస్తుతం నందు భార్యను నేనే అని తులసి నొక్కివోక్కానించడంతో.. కోపంలో ఉన్న శృతి ఇరవై నాలుగు సంవత్సరాలు కాపురం చేసిన నందు అంకుల్ తులసి వదిలేశాడు అలాంటిది మిమ్మల్ని వదిలేయరని గ్యారెంటీ లేదు కదా.. మిమ్మల్ని వదిలేసి తులసి ఆంటీ ని పెళ్లి చేసుకుంటారేమో అంటూ శృతి లాస్య గుండెల్లో అణుబాంబును వేస్తుంది. లాస్య ఏమైనా తక్కువ తినిందా.. శృతి పై పగ తీర్చుకోవడానికి నందు దగ్గర మాస్టర్ స్కెచ్ వేసింది.
ఇక్కడ లాస్య చేసిన విషయాలన్నింటినీ పక్కనపెట్టి శృతి ఏమన్నదో ఆ విషయాలను నందుకు చక్కగా తేనె పూసిన కత్తి లాగా చెబుతుంది. ఈసారి లాస్య ఏడుస్తూ చెప్పడంతో నందు కూడా కరిగిపోయి తన వలలో చిక్కుకుంటాడు. పైగా నేను ఎప్పుడూ మీ ఇంట్లో వాళ్ళతో గొడవ పడుతూ ఉంటానని అందుకే నీతో ఈ విషయం చెప్పను అని కాస్త హైడ్రామా అనే క్రియేట్ చేస్తుంది. ఇలా నాలుగు సెంటిమెంట్ డైలాగ్ లు పండించడంతో నందు కూడా తన మాయలో పడిపోతాడు. ఇక ఎలాగైనా శృతిని కట్టడిలో పెట్టాలనుకుంటున్నా నందు కి.. ఉదయం లాస్య వచ్చి శృతిని టీ పెట్టి ఇవ్వమని అందులో కాస్త ఇలాచీ కూడా వేయమని చెబుతుంది వెంటనే శృతి స్ట్రైట్ గా వెళ్లి లెఫ్ట్ తీసుకుంటే కిషన్ వస్తుంది మీరే మీకు నచ్చినట్టుగా పెట్టుకుని తాగండి అంటుంది. దీంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని శృతి పై నందు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడతాడు. అక్కడే ఉన్న ప్రేమ్ నా భార్యను అంటే ఒప్పుకోనని వాళ్ళ నాన్న ను ఎదురు సమాధానం చెబుతాడు ఇలా మాట మాట పెరిగి అదికాస్తా చిలికి గాలివాన అవుతుంది.
ఇక కోపం వచ్చిన నందు పిల్లలు ఇలా తయారవడానికి కారణం ని గర్భమేనని తులసి కి నందు చివాట్లు పెడతాడు. అది చాలదన్నట్టు పెంపకం తప్పు అని ఒప్పుకోమని తులసి నిలదీస్తాడు.. దాంతో తులసి అక్కడినుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఇలా జరుగుతూ ఉండగా ఈ ఎపిసోడ్ శుభం కార్డు వేసి.. రేపటి ఎపిసోడ్ పై మరింత ఇంట్రెస్ట్ పెంచేందుకు తులసి ఏడుస్తున్న సన్నివేశాలను హైలెట్ చేస్తారు. రేపటి ఎపిసోడ్ లో నందు కి అదిరిపోయే పంచులతో వాళ్ళ నాన్న గట్టిగా క్లాస్ పీకుతాడు. అప్పుడు గానీ నందు కి బుద్ధి రాదు అనేటట్టుగా ఆ సన్నివేశాలు ఉంటాయి. మొత్తానికి రేపటి ఎపిసోడ్ లో ఫ్యామిలీ డ్రామా కొనసాగుతోందని అర్థమవుతోంది.