Intinti Gruhalakshmi: గృహలక్ష్మి ఇంటిలోకి కొత్త క్యారెక్టర్.. ఆఫీస్ నడిపినట్టే ఇల్లు నడుపు అంటూ తులసి లాస్య పై అదిరిపోయే పంచ్..!! 

Share

Intinti Gruhalakshmi: ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి ఒకటి.. ఈ సీరియల్ లో జరుగుతున్న సన్నివేశాలు నిజంగా మన ఇంట్లో జరుగుతున్నట్టుగానే ఉంటాయి.. ఒక్క లాస్య పాత్ర తప్ప.. ఈరోజు ప్రసారం కానున్న 523 వ ఎపిసోడ్ లో ఏం జరగనుందో ప్రత్యేక కథనం మీకోసం..!!

Intinti Gruhalakshmi: Today Episode
Intinti Gruhalakshmi: Today Episode

ఇంటర్వ్యూ కి వెళ్లిన నందు ఈసారి కూడా జాబ్ రాదని అర్థమైపోయి మొహం దిగాలుగా పెట్టుకుని ఇంటికి వస్తాడు.. అక్కడే ఉన్న పరంధామయ్యా – అనసూయ లు ఉద్యోగం రాకపోతే ఇంతకంటే మంచి ఉద్యోగం వస్తుందని ధైర్యం చెబుతారు. తులసి అత్తమామలకు టీ ఇస్తుంది. అంతలో లాస్య వచ్చి హాయ్ ఎవిరీ బడీ అంటూ అత్తమామలు ముందే కాలు మీద కాలు వేసుకుని ఫోన్ చేసుకుంటూ ఉండటం చూసి.. అనసూయ కాళ్లు టేబుల్ మీద పెట్టుకోవడం ఎందుకు తెచ్చి నా నెత్తిన పెట్టు భరిస్తాను అంటూ అత్తలా సెటైర్ వేస్తుంది.. వెళ్లరా వెళ్లి దాని కాళ్ళు నొక్కు అని నందుకు చివాట్లు పెడుతుంది.. ఇవేమీ పట్టించుకోకుండా నందు నేను నీకు చాలా సార్లు ఫోన్ చేశాను ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు లాస్య అంటాడు.. మర్చిపోయా నందు అంటూ కూల్ గా సమాధానం చెబుతుంది.. అది విన్న నందు కోపంగా లాస్యను అడిగే క్రమంలో ఒకరిమీద ఒకరు అదిరిపోయే పంచులు వేసుకుంటారు.. వీరిద్దరి మధ్య జరిగే సంభాషణలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ అలరిస్తాయి.. చివరికి లాస్య కొత్త పనిమనిషిని పెట్టుకునే వరకు ఆ విషయం వెళుతుంది..!!

తులసి కొత్త గా పని మనిషి ఎందుకు అని వారించబోగా.. పనిమనిషిని పెట్టగానే సరిపోదు లాస్య.. మన అలవాట్ల అన్నీ అలవాటు చేయాలి. దగ్గరుండి అన్నీ చేయించుకోవాలి. పనిచేయడం కన్నా ఇది చాలా కష్టమైన పని.. థాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్.. నాకు పని చేయడం రాకపోవచ్చు ఏమో కానీ.. పని చేయించడం బాగా వచ్చు ఆఫీస్ లో వందల మంది తో పని చేయించిన అనుభవం నాది.. ఆ అలాగే కానీ.. ఆఫీస్ నడిపినట్టు ఇల్లు కూడా నడుపుకో అంటూ తులసి చెట్లు డైలాగ్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.. మీకు అవసరం లేకపోతే ఊరుకోండి.. కొత్త పని మనిషి మా ఇద్దరికీ సంబంధించిన పనులు మాత్రమే చేస్తుంది.. తనని రేపే రమ్మంటారు అంటూ లాస్య వెళ్ళిపోతుంది..!! ఈ తతంగం అంతా ఓ పక్క నుంచి చూస్తున్న శృతి ప్రేమపై ప్రయోగించగా అద్భుతమైన రియాక్షన్స్ వస్తాయి.. ఇంతలో ప్రేమ్ కి శృతి పై ప్రేమ పొంగుకు రావడం.. అది కాస్త వాళ్ల తాతయ్య చూసేయడం మరో హైలైట్..!!

 

Intinti Gruhalakshmi: Today Episode
Intinti Gruhalakshmi: Today Episode

పొద్దున ఇంట్లో జరిగిన విషయాన్ని పరంధామయ్య, అనసూయ జీర్ణించుకోలేకపోతారు.. పరంధామయ్య అనసూయకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. వీరిద్దరి మధ్య సంభాషణలు జరుగుతుండగా తులసి వస్తుంది. లాస్య పని మనిషిని తీసుకొస్తాను అంటే మీ అబ్బాయికి లాభం అంటూ అనసూయమ్మ ఒప్పించే ప్రయత్నం చేస్తుంది.. రేపటి ఎపిసోడ్ లో కొత్త పనిమనిషి చెప్పే కండిషన్స్ కి ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురై నోరెళ్లబెడతారు..!! ఇంతకీ పని మనిషి పెట్టిన కండిషన్స్ ఏంటి..!? అందరిని రేపటి ఎపిసోడ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే లాగా ముగిస్తారు నిర్మాతలు..!!


Share

Related posts

దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న విద్యార్థుల ఉద్య‌మం.. ఎందుకంటే..?

Srikanth A

complaint: మనం కొనుక్కున్న ఏ ప్యాకెట్ మీద అయినా ఈ వివరాలు లేకపోతే కచ్చితంగా ఫిర్యాదు చేయవచ్చు!!

siddhu

Divya Bharathi Latest Photos

Gallery Desk