Intinti Gruhalakshmi: నందు కి భార్య గా మారిన తులసి.. లాస్యను నువ్వు రెండో భార్యవి మాత్రమే.. ఆనందంలో నందు..

Share

Intinti Gruhalakshmi: బుల్లితెర టీవీ సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి కి చక్కటి ప్రేక్షకాదరణ లభిస్తోంది.. గతవారం ఊహించని ట్విస్ట్ లతో అలరించగా.. నేడు 525 ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది.. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..!!

Intinti Gruhalakshmi: Today Episode
Intinti Gruhalakshmi: Today Episode
  • లాస్య ను బెదిరించిన వసంత..!!

లాస్య పద వసంతం నీకు వంటగది చూపిస్తాను.. వసంత కాదు వారెవ్వా వసంత అనండి మేడం.. అలా అంటే నాకు కిక్ వస్తుంది.. లాస్య నువ్వు చేసిన వంటలు రుచి చూస్తే కానీ వారెవ్వా వసంత అనలేను.. అప్పుడే నాకు కిక్ వస్తుంది అనడానికి. మాకు లంచ్ ప్రిపేర్ చెయ్యి.. నీకు జీతం ఇస్తుంది నేను. నువ్వు మాకు సంబంధించిన పనులు మాత్రమే చేయాలి. నిన్ను ఎవరైనా భయపెడితే, బెదిరిస్తే నాకు చెప్పు నేను చూసుకుంటాను.. అంటూ లాస్య ఇండైరెక్ట్ గా తులసిని చూస్తూ కౌంటర్ ఇస్తుంది. అవేమీ పట్టించుకోని తులసి ఎప్పటిలాగే తన మంచి మనసుతో ఒక చక్కని టీ చేసి తులసి తన చేతులతో వసంత కు ఇస్తుంది.. నేను ఇప్పటివరకు పని చేసిన వాళ్ల ఇళ్లల్లో వాళ్ళు తాగే కప్పులోనే టీ ఇవ్వరు.. అలాంటిది ఈ మేడం ఏకంగా తన చేతితో టీ పెట్టి తనే ఇస్తుంది. టెస్ట్ అదిరిపోయింది. నాకంటే బాగా పెట్టిందే అంటూ తులసి మంచి మనసును అర్థం చేసుకుంటుంది వసంత. ఇక నందు లాస్య మధ్య పని మనిషి గురించి డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి.. కట్ చేస్తే..

బ్రేక్ ఫాస్ట్ రెడీ మేడం అంటూ వసంత అనడంతో బ్రేక్ ఫాస్ట్ చేయడానికి లాస్య, నందు వస్తారు.. వసంత నేను చేసిన టిఫిన్ తిని ఎలా ఉందో చెప్పండి సార్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి అంటుంది.. టిఫిన్ తిన్న నందు కి అనుకోకుండా దగ్గు, గుండెల్లో నొప్పి వస్తుంది.. అది చూసిన తులసి యావండి పరుగుపరుగున వచ్చి ఏమైంది అంటూ వచ్చి గుండె మీద చెయ్యి వేసి నిమురుతూ.. మంచినీళ్లు తాగిపిస్తుంది. అలా తులసి కాసేపే గుండె నిమరుతు ఉండగా ఎలా ఉంది మీకు ఇప్పుడంతగా అనగా.. ఐయామ్ ఓకే అనడంతో తులసి ఊపిరి పీల్చుకుంటుంది. తనకి ఇలా రావడానికి కారణమైన దోసకాయ కర్రీ అని తెలుసుకొని నందుకు లాస్య కు చివాట్లు పెడుతుంది. ఆయనకు దోసకాయ పడదు అలర్జీ అని నీకు తెలుసు కదా చాలా సార్లు చెప్పాను కదా.. అంటూ భార్య తనకు సేవ చేస్తుంది. మళ్లీ ఎందుకు ఇలా చేసావు అని అరుస్తుంది టెన్షన్ లో మర్చిపోయాను.. అని లాస్య అనడంతో నే వసంత అది ఏంటి మేడం భర్తను కూడా పట్టించుకోనంత పనులేంటి అని తను కూడా ఓ మాట అనేస్తుంది.. అది విన్న అనసూయమ్మ బుడంకాయ్ బలే ఎగురుతోంది అంటూ వారెవ్వా వసంత అంటుంది.. ఏంటి మేడం నన్ను ఏమైనా అంటే ఊరుకోను మా సంఘంలో కంప్లైంట్ చేస్తాను. అప్పుడు మీ ఇంటి పని చేయడానికి ఒక్కరు కూడా రారు అంటూ బెదిరిస్తోంది.. అది చూసిన ఇంట్లో వాళ్ళు మరోసారి తగిన శాస్త్రీ జరిగింది అని సంబరపడుతుంది. అందులో నందుని ఇంటర్వ్యూ వాళ్ళు ఎదురు చూస్తున్నట్లు కాల్ వస్తుంది. అది అడిగిన నందుకు లాస్య అది చిన్న కంపెనీనే అందుకే నేనే రారు అని చెప్పేశా అంటుంది. ఇప్పుడు వీరిద్దరి మధ్య జరిగే సంభాషణలు ఇంట్లో వాళ్లందరి మనసులు చిన్నబుచ్చుకునేలా ఉంటాయి. లాస్య కు కాల్ రావడంతో అక్కడి నుంచి వెళ్లి పోతుంది..

Intinti Gruhalakshmi: Today Episode
Intinti Gruhalakshmi: Today Episode

ఈ విషయం గురించి మాట్లాడడానికి తులసి లాస్య  రూమ్ లోకి వెళుతుంది. లాస్య నీతో నేను ఒకటి మాట్లాడాలి.. ఏంటో త్వరగా చెప్పు నాకు టైం లేదు.. ఇందాక ఆయన జాబ్ విషయంలో అనడం తో నే వెయిట్ ఆయన కాదు మీ ఆయన అను క్లారిటీ వస్తుంది. ఆయన ఇప్పుడు నాకు మాత్రమే భర్త.. నేను ఇప్పుడు తన భార్యను.. హా.. భార్యవే రెండో భార్య వి అని తులసి లాస్య కళ్ళు తెరిపిస్తుంది. అది విన్న లాస్య భార్య అంటే భార్య మొదటిది రెండోది ఉండదు అని కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది.. నేను ఇప్పుడు ఈ నెంబర్ గేమ్ గురించి మాట్లాడడానికి రాలేదు.. నువ్వు ఆయనతో ఏమైనా మాట్లాడాలి, గొడవ పడాలి అనుకుంటే ఈ రూమ్ లో చూసుకోండి. అంతే గాని అందరి ముందు ముఖ్యంగా నా పిల్లలు ముందు ఇలా చేస్తే మాత్రం నేను ఊరుకోను అనేసి అక్కడి నుంచి వచ్చేస్తుంది.. రేపటి ఎపిసోడ్ లో ఇంటర్వ్యూ వెళ్లినందుకు ఉద్యోగం వస్తుంది. సంతోషంతో ఆ విషయాన్ని తన అమ్మానాన్నలతో షేర్ చేసుకుంటాడు.. అది తెలుసుకున్న లాస్య వద్దు అని చెబుతుంది వీరిద్దరి మధ్య ఏం జరుగుతుంది.. నందు ఆ ఉద్యోగం వదిలేస్తాడా..!? లేదంటే లాస్య ఎదిరించి జాబ్ కి వెళ్తాడా..!? అనే విషయాలు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..


Share

Related posts

BB-4 లోని ‘ఆ క్రేజీ 4’ తో స్పెసల్ చిట్ చాట్ ప్లాన్ చేస్తున్న యాంకర్ రవి!!

Naina

బ్రేకింగ్: మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కరోనాతో మృతి

Vihari

Netflix: మీరు తరచూ OTT చూస్తుంటారా? నెట్ ఫ్లిక్స్ దిమ్మతిరిగే ఆఫర్లు మీకోసమే!

Ram