21 January Intinti Gruhalakshmi: లాస్య నూరిపోసిన మాటలను నమ్మిన నన్ను ముందు వెనకా ఆలోచించకుండా.. ఇక అందరూ నీ మాట వినేలా చేస్తాను అని చెప్పడం దాన్ని యధావిధిగా అమలు చేయాలి అనుకుంటాడు. అలా శృతి ను అరుస్తాడు నందు.. నేటి 535 వ ఎపిసోడ్ కంప్లీట్ ఫ్యామిలీ ఫ్యామిలీ డ్రామా నడుస్తుంది..
నందును శృతిని అరవడం.. అది విన్న ప్రేమ్ నా భార్యను అనే హక్కు లేదని వాళ్ల నాన్నను అనడంతో.. పిల్లలు నీ దగ్గర గారాబం వల్ల ఇలా తయారు చేశారు అంటూ నందు తులసి నీ టార్గెట్ చేస్తాడు.. దాంతో ఇంట్లో వాళ్ళ అందరి ముందు అభి అప్పుడు చేస్తున్నాడని.. తన భార్య నగలు తాకట్టు పెట్టాలని చెబుతాడని.. ఇక నీ రెండో కొడుకు తండ్రి మాటకి ఎదురు చెప్పే అంత పెద్దవాడు అయ్యాడని.. దివ్య చేతిలో లాప్ టాప్ పెట్టుకొని చదువుకుంటుంది అనుకుంటున్నావు.. అది బయటకు వెళ్ళి తన ఫ్రెండ్స్ తో ఏం చేస్తుందో చెప్పమంటావా అంటూ.. ఇలా పిల్లలు ముగ్గురిని పనికిరాకుండా తయారు చేశావని.. పిల్లల్ని సరిగ్గా పెంచలేదని.. నీదే తప్పని ఒప్పుకో తులసిని నిందిస్తాడ.. ఒప్పుకోమని బలవంతం చేయగా.. ఏడుస్తూ తులసి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ఇక నందు ఆలోచిస్తూ ఉండగా.. వాళ్ళ నాన్న వచ్చి అందరి ముందు నీ పరువు తీయడం ఇష్టం లేక ఇక్కడికి వచ్చి చెబుతున్నాను అంటూ.. ఒక మంచి మనిషిని బాధ పెట్టావు నన్ను అంటూ తల్లిగా తులసి ఓడిపోయింది అంటే తండ్రి గా నువ్వు కూడా ఓడిపోయాను అని అర్థం. పిల్లలు ముందే నువ్వు లాస్య తీసుకుని ఇంట్లో పెడితే నీ నుంచి పిల్లలు ఏం నేర్చుకోవాలని.. అభి డాక్టర్ అయ్యేందుకు తులసి ఎంత కష్టపడింది.. ప్రేమ్ శృతి ని పెళ్లి చేసుకోవడం లో తులసి ఎంతగా ప్రోత్సహించింది.. దివ్య ను ఎవరో ఎత్తుకెళ్లి పోతే తులసినే కదా కాపాడి తీసుకువచ్చింది.. అప్పుడు ఏమైంది ఈ తండ్రి ప్రేమ అంటూ నందు నిలదీస్తాడు.. లాస్య ముందు నువ్వు హీరోయిజం చూపించడానికి తులసి ని నిందిస్తావా అంటూ నందు కి క్లాస్ పీకుతాడు వాళ్ల నాన్న..
ఇక తులసిని ధనలక్ష్మి పూజ కి కావలసిన సరుకులు తీసుకువచ్చారు ఆంటీ అని అంకిత శృతి అడగగా.. తీసుకురాలేదు అంటుంది. మర్చిపోయారేమో అన్ని అనే లోపు మర్చిపోలేదు. నేను తీసుకు వస్తే మీరు ఎప్పుడూ నేర్చుకుంటారు.. అని తులసి రివర్స్ గేర్ లో వస్తుంది. మీరు కూడా ఇంటి పనులు, బాధ్యతలు తీసుకోవాలి అని తులసి మాట్లాడుతున్న విషయాలన్నీ వెనకనుంచి నందు గమనిస్తూనే వుంటాడు.
లాస్య తులసి తో పూజ టైంలో నువ్వు ఎక్కడ ఉంటే నందు ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. అయినా రేపు పూజ లో చేయబోతుంది నువ్వు కాదు.. మన తరువాత తరం కోడళ్ళు.. నువ్వు ఈ ఇంటికి కొత్త కోడలీలా రాలేదు.. కోడలికి అత్తగారులా వచ్చావు.. నందు ని నమ్ముకుంటే లాభం లేదు అనుకున్న లాస్య ఎలాంటి స్కెచ్ వేస్తుంది.. తనే పూజ లో పాల్గొనడానికి ఏం చేస్తుందో..!? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..