Intinti Gruhalakshmi: తులసి విషయంలో తను చేసిన తప్పులను తెలుసుకుంటున్న నందు ను.. రివర్స్ యాంగిల్ చూపించడంతో సీరియల్ చక్కటి రేటింగ్ ను సొంతం చేసుకుంటుంది.. ఇక నేటి ఎపిసోడ్ లో కూడా అదే జరగనుంది.. నందుని చీదరించుకున్న లాస్య.. ఇంతకీ నేటి 538 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..!?

మోజుపడి చేసుకున్న లాస్య అందాన్ని చూస్తూ నందు ప్రేమగా గా అర్జెంటుగా వెళ్లి స్నానం చేయమంటూ నాలుగు చివాట్లు పేడుతుంది. లాస్య దాంతో గతంలో తులసి కూడా నన్ను దగ్గరికి ప్రేమగా వచ్చే బయటకు తీసుకెళ్ళమని అడుగుతుంది మీ దగ్గర ఎప్పుడు చూసినా పప్పు సాంబార్ వాసన వస్తుంది ముందు వెళ్ళి స్నానం చెయ్యి బయటికి వెళ్లే సంగతి తర్వాత అని నందు చీదరించుకునే సంగతి గుర్తుకు వస్తుంది.. ఇప్పటికీ గాని తులసి చేసిన తప్పులు గుర్తుకురాలేదు నందు కి.. మొత్తానికి లాస్య వలన తులసి నీ బాధ పెట్టినా సంగతులన్నీ నిదానంగా గుర్తొస్తున్నాయి. అంతేలే పిండి కొద్దీ రొట్టె అన్నట్టు.. ఎవరు చేసుకున్న దానికి వారు అనుభవించాలిగా..

అంతలో నందు రెడీ అయి.. అద్దంలో చూసుకుంటూ ఉండగా లాస్య నందుని హగ్ చేసుకుంటుంది.. ఆల్రెడీ ఒకసారి దెబ్బ తగిలిన నందు లాస్ ను దూరంగా నెట్ వేస్తాడు. ఏంటి టిట్ ఫర్ టాట్ ఆ అంటుంది. నేను ఏమి చిన్న పిల్లవాడిని కాదు అలా చేయడానికి.. అనేసి ఎనర్జీ డ్రింక్ షేక్ తాగుతాడు. నువ్వు ఉపవాసం ఉంటావని ఇంట్లో వాళ్ళ అందరికీ చెప్పేసాను అని చెప్తుంది. నా గురించి ఎవరికైనా ఏదైనా చెప్పడానికి నన్ను అడిగి చెప్పాలి అని చెప్తాడు. ఇంకా ఈ రోజు కూడా ఆఫీస్ వెళ్తానని చెప్తాడు. ఇక హల్ లోకి వచ్చి వల్ల అమ్మకు చెప్పేసి ఆఫీస్ కి వెళ్తున్నట్టు చెప్తాడు. లాస్య కవర్ చేయడానికి కొత్త ఉద్యోగం పైగా పండుగ.. ఆయన కేఫ్ లో ఉండటం ముఖ్యం.. అందుకే నేనే నచ్చచెప్పి వెళ్ళమంటున్నాను. నువ్వు వెళ్ళు నందు అంటుంది.. ఇక దివ్య లాస్యను అదోలా చూస్తుంది.. ఏంటి అలా చూస్తున్నావ్.. భలే కవర్ చేశారు ఆంటీ.. ఎంటి కవర్ చేసేది ఏం మాట్లాడుతున్నావ్.. ఇందాక నేను పూలు కడుతుండగా మీరు డాడ్ మాట్లాడుకుంటూన్నవన్ని విన్నాను. డాడ్ నీ అడగకుండా పూజ కు ఉండటానికి మాట ఇచ్చినందుకు డాడ్ మిమ్మల్ని కొప్పడ్డారు కదా.. దివ్య అని తులసి పిలవలాగా అవును మామ్ పూజ కంటే కేఫ్ ముఖ్యమని డాడ్ చెప్పారు.. లాస్య ఆంటీ ఎంత రిక్వెస్ట్ చేసినా ఉండను అని చెప్పారు. దాంతో ఇంట్లో వాళ్లందరి ముందు పరువు పోగా.. అందరూ లోలోపల నవ్వుకున్నారు.. మొగుడు పెళ్ళాల మాటలు చాటుగా వెళ్లడానికి సిగ్గులేదా.. అదేమీ చాటుగా వినలేదు. మీరే ఊరంతా వినిపించే లాగా అరుచుకొని ఉంటారు. మీకు ఇది మామూలే కదా అని వాళ్ళ అత్తయ్య నాలుగు తగిలిస్తుంది లాస్యకి.. ఇంతలో తులసి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది. లాస్య తో తులసి నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా నన్ను ఏమి చెయ్యలేవు. కనీసం నువ్వైనా ప్రశాంతంగా ఉండు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది..

ఇక ఈరోజు పండగా చేసే వద్దు అన్నా కావాలని తెరిచామని రవి అంటుండగా.. ఇళ్లకు వెళ్ళలేని వారు ఇంటికి దూరంగా ఉన్నవారు బ్యాచీలర్స్ పండగా చేసుకోవాలి అని ఇంటి వాతావరణం, ఇంటి భోజనం మిస్ అవుతారు. వాళ్ళకి అది మనం అందిస్తే కేఫ్ కి వస్తారు. అయినా ఇదంతా వర్క్ అవుట్ అవుంతా.. మోర్నింగ్ న్యూస్ పేపర్ లో పామ్ ప్లేట్స్ పంపించా దాంతో అందరికీ తెలిసింది అంటాడు.. అంతలో నందు లాస్య కి కాల్ చేసి అర్జంట్ గా కేఫ్ కి రమ్మని పిలుస్తాడు. నువ్వు ఒక్క దానివే రమ్మని ఈ విషయం ఎవరికీ చెప్పొద్దూ అని చెబుతాడు. దాంతో లాస్య పూజ లో నుంచి లేచి వెళ్ళిపోతుంది. నందు ఎందుకు లాస్య కు ఫోన్ చేసి రమ్మంటాడు.. ఏం జరిగిందో తరువాయి భాగంలో చూద్దాం.