Intinti Gruhalakshmi: లాస్యని ఎదురించి ఇంటర్వ్యూ కి వెళ్లిన నందుకి జాబ్ వస్తే..!? లాస్య రియాక్షన్ ఏంటి..!? శృతి ప్రగ్నెంటా..!?

Share

Intinti Gruhalakshmi: కొత్త పంథా తో డిఫరెంట్ జోనర్ లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకెళుతోంది.. నిన్న వసంత మొదటిసారి వంట చేయడం.. ఆ టిఫిన్ తిన్న నందు అస్వస్థతకు గురవడం వెంటనే తులసి నాలుగు చివాట్లు తగిలించడం నందు చేయడానికి లాస్య ఇంటర్వ్యూ కి పిలిచిన వాళ్ళకి ఇంటర్వూ కి రాడు అని చెప్పడం.. అది తెలుసుకున్న నందు లాస్య పై ఫైర్ అవడం జరిగింది.. నేటి 526వ ఎపిసోడ్ లో రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో చూద్దాం రండి..!!

Intinti Gruhalakshmi: Today Episode Highlights

తులసి మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉంటే మీ రూమ్ లో చూసుకోండి.. పిల్లల దగ్గర కాదు అని చెబుతుండగా నందు వచ్చి వెళ్తున్నాను అని చెబుతాడు.. లాస్య అక్కడికి అని అడగగానే నువ్వు నో చెప్పావుగా అదే కంపెనీకి ఇంటర్వ్యూ కి వెళ్తున్నాను అంటాడు.. చిన్న కంపెనీలలో కూడా పెద్ద పొజిషన్స్ ఉంటాయి.. పెద్ద కంపెనీలో చిన్న పొజిషన్ లో పనిచేసే కంటే చిన్న కంపెనీ లో పెద్ద పొజిషన్ లో వర్క్ చేయడం బెటర్ అనిపించింది.. పులికి తోకల బతకడం కంటే పిల్లికి తలలా బ్రతకడం బెటర్ అనిపించింది.. నేను వెళ్తున్నాను అని చెప్పేసి నందు అక్కడ నుంచి వెళ్ళి పోతాడు.. తులసి వెళ్ళిపోతుండగా లాస్య తన చెయ్యి పట్టుకుని నా భర్తకి దగ్గరవడానికి ప్రయత్నించకు.. దగ్గరవ్వాలి అనుకుంటే అసలు దూరమయ్యే దాన్ని కాదు అని తులసి లాస్య కు చురక అంటిస్తుంది.. అదే కదా నా బాధ కూడా పెళ్లికి ముందు ఇక్కడే ఉన్నావ్.. పెళ్లి తర్వాత కూడా ఇక్కడే ఉన్నావ్ అని లాస్య అనడంతో.. ఓకే పైకప్పు కిందే ఉన్నా దూరంగానే ఉన్నాం కదా అని తులసి అనగానే.. షట్ అప్ అంటూ లాస్య వేలు చూపిస్తూ అవసరానికి మించి ఎక్కువ మాట్లాడకు తులసి అంటుంది.. నీ ఆలోచన మాత్రం అవసరానికి కంటే చాలా తక్కువగా ఉంటాయి.. ఇల్లు నీ పేరు మీద ఉందనే కదా.. అందుకే నీకు అంత పొగరు ఎంత సేపు ఇల్లులు సొంతం చేసుకోవాలి. అనుకుంటే అనే ఆలోచన తప్ప కుటుంబాన్ని సొంతం చేసుకోవాలి. అని ఆలోచన రాదా నీకు కుటుంబాన్ని ఓడించడానికి కాదు గెలవడానికి ప్రయత్నించు.. అందరికీ మంచిదని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లి పోతుంది తులసి.. కట్ చేస్తే..

వసంత సెల్ ఫోన్ లో పాటలు పెట్టుకుని వాషింగ్ మిషన్ లో గుమ్మరిస్తూ ఉంటుంది.. ఎంతైనా హైటెక్ పనిమనిషి ఆ మాత్రం జోరు లేకపోతే ఎలా.. ఒకే సారి డబ్బా డబ్బా గుమ్మరివ్వడమే.. మొత్తానికి లాస్య తిక్క కుదిరిస్తుంది ఈ పని మనిషి.. అక్కడే ఉన్న అనసూయమ్మ దీని వాళ్ల కోసం పిచ్చి పిచ్చి చేష్టలు చూస్తూ ఉంటుంది ఎప్పుడైతే సర్ఫ్ అలా గుమ్మరిస్తు ఉంటుందో అప్పుడు వచ్చి చలమల తినేస్తుంది వీళ్లిద్దరి మధ్య జరిగే సంభాషణలు టీవీ లో చూస్తే నవ్వాపుకోలేరు అంతే.. అర్జెంటుగా ఈ రాజమండ్రి గుమ్మడికాయ గురించి మేడం తో చెప్పలే లేకపోతే నేను మనశ్శాంతిగా ఉండలేను అనుకుంటుంది వసంత..

Intinti Gruhalakshmi: Today Episode Highlights

ఇంటర్వ్యూ కోసమని వెళ్ళిన నందు ఒక కేఫ్ లో కూర్చొని నేను ఎందుకు ఇలా మారానని ఆలోచించుకుంటూ ఉంటాడు.. అంతలోకి తన ఫ్రెండ్ ప్రకాష్ వచ్చి ఎలా ఉన్నావు అంటూ నందుని పలకరిస్తాడు. నందు కాఫీ ఆర్డర్ ఇవ్వబోగా ఏంటి నా కేఫ్ లో నాకే కాఫీ ఇస్తా అంటూ నవ్వుతాడు.. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ నందు జాబ్ లేదన్నా విషయాన్ని తెలుసుకుంటాడు. అప్పుడే ప్రకాష్ నీకు ఒక ఐడియా చెప్తాను. నచ్చితే ఫాలో అవ్వు లేకపోతే వదిలేసి అంటాడు. ఏంటి నీకు తెలిసిన కంపెనీ లో ఏదైనా జాబ్ ఉందా అని నందు అనడంతో కాదు.. నా కేఫ్ లోనే ఒక ఆఫర్ ఉంది. కేఫ్ లోనా అంటూ నందు ఆలోచిస్తాడు. జాబ్ చేసుకుంటూ సొంతంగా కేఫ్ స్టార్ట్ చేశాను. రెండు పడవల మీద ప్రయాణం చేయడం చాలా కష్టంగా ఉంది. నాకు నమ్మకంగా పనిచేసే ఒక వ్యక్తి కావాలి . అది నువ్వు ఎందుకు కాకూడదు. కేఫ్ లో నేను చేయడానికి ఏముంటుంది వాళ్ళు అని నందు ప్రశ్నిస్తాడు..!? సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఒక విధంగా చెప్పాలంటే.. పేరుకే నేను ఓనర్ ని మొత్తం బాధ్యత అంతా నీదే. శాలరీ ఎక్కువ కాకపోవచ్చు.. అలా తక్కువ కాదు. కేఫ్ ని బాగా డెవలప్ చేస్తే షేర్ కూడా ఇస్తాను అన్నాడు. సరే నువ్వు ఆలోచించుకో అనేసి అక్కడనుంచి వెళ్ళిపోతాడు ప్రకాష్.. నందు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు.. కట్ చేస్తే..

వసంత ఫోన్లో ఎవరితోనో తన ఇంటి విషయాలు గురించి మాట్లాడటం వింటుంది. మా మేడం కాకుండా ఇంకో మేడం ఉందని చెప్పండి ఆ మేడమ్ మా సార్ మొదటి భార్య అంట ఆవిడ కూడా ఇదే ఇంట్లో ఉంటుంది. చూడటానికి అందంగానే ఉంటుంది ఆవిడని వదిలేసి మా మేడం ని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు అంటూ లాస్య, నందుల గురించి, వారి ప్రవర్తన గురించి చుట్టూ పక్కల ఎవ్వరు ఉన్నారో గమనించకుండా వసంత తన స్టైల్లో చెప్పుకుంటూ పోతూ ఉంటుంది.. అలా మాట్లాడుతూ ఉండగా తులసి తనను గమనిస్తున్న విషయం చూస్తుంది వెంటనే ఫోన్ కట్ చేసి మళ్ళీ చేస్తాను అంటూ పెట్టేస్తుంది. తులసి అక్కడ నుంచి వెళ్ళి పోతుండగా.. వసంత వచ్చి మేడం మీకు ఇదంతా ఇబ్బందిగా అనిపించడం లేదా..!? అదే మొదటి పెళ్ళాం.. రెండో పెళ్ళాం కలిసి ఒకే ఇంట్లో ఉండటం..!? చూసేవాళ్లు నవ్వుకుంటారు.. మీకేం అనిపించదా..!? ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. మనసులో ఉన్న మాట బయటికి అడిగేస్తున్నాను..!? తులసి నేను మీ సార్ కి మొదటి వారిని విడాకులు తీసుకోవడం ఎవరి జీవితం వాళ్ళది నేను రెండో భార్య నిజానికి నేను ఇంట్లో ఉండకూడదు మా ఇంట్లో వాళ్ళ కోసం నేను ఇంట్లో ఉండాల్సి వస్తుంది నేను మీ సార్ కి పరాయి గాని కావచ్చు ఇంట్లో అలా కాదు చాలా ఇంకా వేరే ఏమైనా వివరాలు కావాలా ఏవైనా అక్రమ సంబంధాలు ఉంటే కదలాలి కానీ తెగిపోయిన వివాహ బంధం గురించి కాదు నువ్వు నీకు ఎవరికైనా చెప్పుకుంటారు కానీ నిజం చెప్పు ఉన్నది ఉన్నట్టు చెప్పు అనేసి వెళ్ళిపోతుండగా.. వసంత మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది మేడం అని తనని నచ్చజెప్ప పోగా నేను పాతకాలం మనిషిని అంటూ వెళ్ళిపోతుంది.. మరోవైపు శృతి వాంతులు చేసుకుంటుంది..

నందు ఇంకా ఇంటర్వ్యూ కి వెళ్లాలన్న ఆలోచన డ్రాప్ చేసుకున్న.. థాంక్స్ రా నాకు ఒక బెస్ట్ ఆఫర్ ఇచ్చావు.. అంటూ కేఫ్ లో జాబ్ చేయడానికి ఒప్పుకుంటాడు.. ఒక మంచి రోజు చూసుకుని కేఫ్ లో జాయిన్ అయిపో అంటాడు ప్రకాష్.. ఇక రేపటి ఎపిసోడ్ లో నందు కి జాబ్ వచ్చిన విషయం వాళ్ళ అమ్మ నాన్న అదే చెప్తాడు అదే విషయం లాస్య కి చెప్పగా వద్దు అంటుంది. నేను నీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతే.. ఈ విషయంలో లాస్య చేసే రచ్చ ఎలా ఉంటుందో చూడాలి.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

5 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

8 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago