RRR: మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన భారీ పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ నమోదు చేస్తూ దూసుకెళుతోంది. ఇప్పటికే దాదాపు రూ 600 కోట్ల వరకు వస్తూళ్ళు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. రాజమౌళి అంటే అపజయం ఎరగని గొప్ప దర్శకుడు అని ఆర్ఆర్ఆర్ చిత్రం మరోసారి నిరూపించింది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా నటించారు. బాలీవుడ్ స్టార్ ఆలియా భట్, అజయ్ దేవగన్ సహా పలువురు సౌత్ అండ్ హాలివుడ్ స్టార్ నటించారు.
సరిగ్గా వారం ముందు వచ్చిన ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో ఆర్ఆర్ఆర్ సినిమాకు గట్టి పోటీ తప్పదని అందరూ అనుకున్నారు. అంతేకాదు, ఈ సినిమా మీద ఐపిఎల్ ప్రభావం కూడా తీవ్రంగా పడుతుందని భావించారు. కాని, ఇవేవీ రాజమౌళి విసిరిన అస్త్రం ఆర్ఆర్ఆర్ పై పనిచేయలేదు. డే వన్ నుంచి ఈ సినిమా సంచలన వసూళ్ళు రాబడుతూ హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా ఇందులో పోరాట యోధులుగా నటించిన చరణ్ – తారక్ పాత్రల గురించి వాటిని మలిచిన రాజమౌళి గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు.
RRR: ఆయన మనసులో ఉన్న మల్లి ఈ అమ్మాయే..
అల్లూరిగా చరణ్, కొమురమ్ భీమ్ గా తారక్ నటన అద్భుతం అని చెప్పుకుంటున్నారు. అయితే ఇదే అభిమానులు ఈ సినిమాలో మల్లి పాత్రలో నటించిన చిన్నారి గురించి ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. రాజమౌళి సినిమాలో ఒక్క సీన్ చేసిన వారు ఒకే ఒక్క డైలాగ్ చెప్పిన వారు హైలెట్ అవుతుంటారు. అలాగే, ఈ చిన్నారి హైలెట్ అయింది. అయితే, ఈ చిన్నారి పేరు పేరు ట్వింకిల్ శర్మ. ఛండీగర్ రాష్ట్రానికి చెందిన అమ్మాయి. ఇప్పటికే పలు టీవీ యాడ్స్‌లో నటించింది. డాన్స్ ఇండియా డాన్స్‌లో షోలో పాల్గొని పాపులర్ అయింది. ఈ క్రమంలోనే ఈ చిన్నారి చేసిన ఫ్లిప్ కార్ట్ యాడ్ దర్శకుడు రాజమౌళి చూడటం జరిగింది. ఆయన మనసులో ఉన్న మల్లి ఈ అమ్మాయే అని జక్కన్న ఆర్ఆర్ఆర్ కోసం ఎంచుకున్నారు.