JERSEY : టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని నటించిన “జెర్సీ” సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాక అనేక అవార్డులను సొంతం చేసుకోవటం జరిగింది. క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో అలరించడం జరిగింది. 2019 సంవత్సరంలో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయి బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టింది. అప్పటిదాకా వరుస ఫ్లాపుల్లో ఉన్న నాని “జెర్సీ” సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి తాజాగా ఐపీఎల్ క్రికెట్ ఆటగాడు కడప ప్రాంతానికి చెందిన వ్యక్తి హరీష్ శంకర్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు.
“జెర్సీ” సినిమా తాను చాలాసార్లు చూడటం జరిగిందని చెప్పుకొచ్చాడు. సినిమా చూసిన ప్రతిసారి తాను ఎమోషనల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ ట్రోఫీకి తాను సెలక్ట్ అయినట్లు కాల్ లెటర్ వచ్చిన సమయంలో..జెర్సీ సినిమాలో ట్రైన్ దగ్గర నాని అరిచినట్లు ..అదే తరహాలో తన భావోద్వేగం అప్పట్లో వచ్చిందని తాజాగా హరీ శంకర్ రెడ్డి పేర్కొన్నాడు.
ప్రస్తుతం దేశవాళి క్రికెట్ జట్టులోకి వచ్చే మాదిరిగా ఆడుతున్న ఈ కడప కుర్రోడు..అదిరిపోయే బౌలింగ్ వేస్తూ.. మంచి స్పీడ్ గా వికెట్లు తీస్తూన్నాడు. యార్కర్ బంతులు వేయటంలో స్పెషలిస్ట్ గా హారీష్ శంకర్ రెడ్డి చాలామంది క్రికెట్ ప్రముఖుల చూపులు ఆకట్టుకుంటూ ఉన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై టీం కి ఆడుతున్న ఇతగాడు ఈ ట్రోఫీలో ఏదైనా మ్యాజిక్ జరిగితే ఇతని తలరాత మారే అవకాశం ఉన్నట్లు.. దేశవాళి క్రికెట్ టీం లోకి రావటం గ్యారెంటీ అన్నట్టు స్పోర్ట్స్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?