Adipurush: ప్రభాస్ అభిమానులకు ఆదిపురుష్ చిత్రబృందం మళ్ళీ తీవ్రంగా నిరాశపరిచారు. అసలే డార్లింగ్ ఖాతాలో రెండు ఫ్లాపులొచ్చిపడ్డాయి. దీంతోనే ఆయన అభిమానులందరూ తెగ ఫీలైపోతున్నారు. అలాంటి సమయంలో కోరుకుంది ప్రస్తుతం నటిస్తున్న బాలీవుడ్ స్ట్రైట్ సినిమా ఆదిపురుష్ సినిమా నుంచి ఎగ్జైటింగ్ సర్ప్రైజ్. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్నారు. బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. దాదాపు రూ 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఇది నిర్మితమవుతోంది.
అయితే, నేడు శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ఇందులో ప్రభాస్ పోషిస్తున్న రాముడి అవతారాన్ని రిలీజ్ చేస్తారని గత నెలరోజులుగా అభిమానులే కాదు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. కానీ, దర్శకుడు ఈ విషయంలో అందరినీ తీవ్రంగా నిరాశపరిచాడు. ఆదిపురుష్ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభాస్ అభిమానులు తయారు చేసిన పోస్టర్స్( ఫ్యాన్ మేడ్ ) అన్నీ కలిపి ఓ వీడియోగా తయారు చేసి దాన్నే ఈ పండుగ సందర్భంగా వదిలారు. ఇది అభిమానులకు ఏ మాత్రం సంతృప్తినివ్వడం లేదంటున్నారు.
Adipurush: ఇప్పట్లో అభిమానులు ఆశిస్తున్న సర్ప్రైజెస్ రానట్టే..?
వాస్తవంగా ప్రభాస్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వస్తుందని ఎంతో ఆశపడ్డారు. అందుకే ఇదేం అప్డేట్ అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ ఆదిపురుష్ మేకర్స్‌పై ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే రాధే శ్యామ్ సినిమా ఫ్లాపయిందని ప్రభాస్ డైహార్ట్ ఫ్యాన్స్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయినా కూడా ఇలా అభిమానుల సహనాన్ని ఎందుకు పరీక్షిస్తున్నట్టో అర్థం కావడం లేదంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇప్పట్లో అభిమానులు ఆశిస్తున్న సర్ప్రైజెస్
ఆదిపురుష్ సినిమా నుంచి వచ్చేలా లేవనిపిస్తోంది.
उफनता वीरता का सागर,
छलकती वात्सल्य की गागर।
जन्म हुआ प्रभु श्रीराम का,
झूमें नाचे हर जन घर नगर।।Celebrating the victory of good over evil✨#ramnavmi #adipurush pic.twitter.com/Xbl1kOgZ7z
— Om Raut (@omraut) April 10, 2022