Alia Bhatt: ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా నుంచి ఆలియా డ్రాపయిందా..? అంటే ప్రస్తుతం అవుననే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే పాన్ ఇండియన్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇటు తారక్‌కు అటు చరణ్‌కు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు. ఎన్టీఆర్ చేసిన కొమురం భీమ్ పాత్రకు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానుల నుంచి, ప్రేక్షకుల నుంచి గొప్ప ప్రశంసలు దక్కుతున్నాయి.
ఇప్పటి వరకు తారక్ టాలెంట్ గురించి సౌత్ ఆడియన్స్‌కు మాత్రమే తెలుసు. కానీ, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో నార్త్‌లో కూడా తారక్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. దీంతో ఈ నందమూరి హీరో నుంచి రాబోయే సినిమాల మీదే అందరి దృష్టి పడింది. కాగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30వ సినిమాను చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్ అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఆలియా కూడా ఈ విషయాన్ని హింట్ ఇచ్చింది.
Alia Bhatt: అఫీషియల్‌గా మాత్రం ఇంకా వెల్లడి కాలేదు..!
ఇదే నిజమైతే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఆలియా తెలుగులో నటించే సినిమా ఇదే. అంతే కాదు, ఈ సినిమాలో ఆలియా పూర్తి స్థాయిలో హీరోయిన్గా నటించినట్టు అవుతుంది కూడా. పాన్ ఇండియా స్థాయిలో రూపొందించే ఎన్టీఆర్ 30 ని ఈ కారణంతోనే ఆలియా ఒప్పుకుందని ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు ఆలియా ఈ ప్రాజెక్ట్ నుంచి డ్రాపయిందా అనే రూమర్స్ సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ వల్ల తనకేమీ లాభం చేకూరలేదనే భావనతోనే ఈ మూవీ నుంచి తప్పుకుందని ప్రచారం జరుగుతోంది. కానీ, ఇది అఫీషియల్‌గా మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. చూడాలి మరి దీనిపై క్లారిటీ ఎప్పుడు వస్తుందో.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?