Alia bhatt – Pooja hegde: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్ వచ్చి చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాతో బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా భట్ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఎన్.టి.ఆర్, రాం చరణ్ హీరోలుగా డీవీవీ దానయ్య నిర్మాణంతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ తెరకిక్కించారు. ఈ సినిమాలో రాం చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తోంది. అల్లురిగా కనిపించనున్న చరణ్ జోడీగా సీత పాత్రలో ఆలియా మెరవనుంది.
ఇప్పటికే ఆర్ఆర్ఆర్లో సీత పాత్రలో ఆలియా ఎలా ఉంటుందో చూపించారు రాజమౌళి. ఇందులో ఆమె కనిపించేది మొత్తంగా కేవలం 20 నిమిషాలు మాత్రమే. కానీ, ఆ 20 నిమిషాల పాత్రే హైలెట్‌గా నిలుస్తుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ – దర్శకుడు రాజమౌళి – డైలాగ్ రచయిత సాయి మాధవ్ బుర్రా సహా హీరోలు ఎన్.టి.ఆర్, చరణ్ గొప్పగా చెప్పుకొచ్చారు. ఆలియా లుక్ చూస్తే వారందరూ చెప్పింది నిజమే అంటున్నారు అభిమానులు కూడా. ఇలా టాలీవుడ్లో ఈ బాలీవుడ్ యంగ్ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది.
Alia bhatt – Pooja hegde: కొరటాల పూజా హెగ్డేను తీసుకుంటారని ప్రచారం జరిగింది.
అంతేకాదు పాన్ ఇండియన్ సినిమాలకు ఆలియా భట్ క్రేజ్ బాగా ఉపయోగపడుతుందనే మేకర్స్ నమ్మకం ఎక్కువైంది. ముఖ్యంగా హిందీలో మన తెలుగు సినిమాకు మంచి వసూళ్ళు రావాలంటే ఆలియా బెస్ట్ ఛాయిస్ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్.టి.ఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో ఇప్పుడు హీరోయిన్గా ఆలియా భట్‌ను తీసుకోవాలనుకుంటున్నారట. ఇన్నాళ్ళు కొరటాల పూజా హెగ్డేను తీసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు తెరమీదకు ఆలియా భట్ పేరు రావడంతో ఆలియా వస్తే పూజా హెగ్డే పరిస్థితేంటీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారట. చూడాలి మరి దర్శక, నిర్మాతలు అఫీషియల్‌గా ఏ హీరోయిన్ను ఫైనల్ చేస్తారో.