Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేశ్ బాబు నుంచి సినిమా వచ్చి మూడేళ్ళు కావస్తోంది. వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటున్న మహేశ్ బాబు గత చిత్రం సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత వంశీపైడి పల్లి దర్శకత్వంలో సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని మేకర్స్ కూడా అధికారికంగా వెల్లడించారు. కానీ, ఫైనల్ స్క్రిప్ట్ విన్న మహేశ్ బాబు నచ్చలేదని సున్నితంగా వంశీపైడి పల్లికి నో చెప్పారు. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య సినిమాలో కూడా మహేశ్ నటిస్తాడని వార్తలు వచ్చాయి.

అయితే, కరోనా మొదలవడంతో పరిస్థితులన్నీ తారుమారై మహేశ్ ఆచార్య సినిమా చేయలేకపోయారు. బడ్జెట్ కారణంగానే మహేశ్ బాబు కాకుండా చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చి ఈ ప్రాజెక్ట్‌లో చేరాడు. ఇలా కొన్ని నెలలు మహేశ్ బాబు కొత్త ప్రాజెక్ట్ మొదల వకుండానే గడిచిపోయింది. ఎట్టకేలకు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాను ప్రకటించారు. మూడు అగ్ర నిర్మాణ సంస్థలైన జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.
Sarkaru Vaari Paata: ఈవెంట్‌కు నిజంగా బాలయ్య గెస్ట్‌గా వస్తున్నారా..!
ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తైంది. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా జరుగుతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ఇప్పటికే కళావతి, పెన్ని లిరికల్ వీడియో సాంగ్స్‌ను వదిలారు. ఈ రెండు పాటలు యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబడుతూ ట్రెండింగ్‌లో నిలిచాయి. ఇదిలా ఉంటే, సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నట సింహం నందమూరి బాలకృష్ణ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ చేసే పాన్ ఇండియన్ సినిమాలో కూడా బాలయ్య నటిస్తున్నట్టు వార్తలు రాగా అవి రూమర్స్ అని క్లారిటీ ఇచ్చారు. మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నిజంగా బాలయ్య గెస్ట్‌గా వస్తున్నారా లేదా చూడాలి.