టిఆర్పి రేటింగులు పడిపోకుండా జాగ్రత్త పడటానికి బిగ్ బాస్ షో నిర్వాహకులు స్క్రిప్ట్ పరంగా హౌస్లో ఇంటి సభ్యులను నడిపించడానికి రెడీ అవుతున్నట్లు సోషల్ మీడియాలో అనుమానాలు నెలకొన్నాయి. ఇందువల్లే టీవీ9 యాంకర్ దేవి నాగవల్లిని చివరి నిమిషంలో ఎలిమినేషన్ చేయడం జరిగిందనే డిస్కషన్లు జరుగుతున్నాయి. ఆమె లాంటి వాళ్ళు ఉండటం వల్ల హౌస్ లో స్క్రిప్ట్ పరంగా ఇంటి సభ్యులను నడిపించే పరిస్థితి ఏర్పడదని, దేవి నాగవల్లిని అందుకే ఎలిమినేట్ చేసినట్లు నెటిజన్లు బయట భావిస్తున్నారు.
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ జరుగుతున్న తరుణంలో చాలావరకు టిఆర్పి రేటింగులు పడిపోయే పరిస్థితి ఉండటంతో ఇంటిలో సభ్యులను గ్రిప్ లోకి వచ్చే వారిని మాత్రం ఉంచి…. మిగతా వారిని ఎలిమినేట్ చేయడానికి షో నిర్వాహకులు రెడీ అయినట్లు టాక్ నడుస్తుంది. ఇదిలా ఉండగా పాపులర్ అయిన మెహబూబ్ ప్రస్తుతం ఇంట్లో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నాడు.
అయితే ఈ కాండేట్ ఎప్పుడో ఇంటి నుండి బయటకు రావాల్సిన వాడని…దేవి నాగవల్లి ఎలిమినేట్ అయిన సమయంలోనే ఇతడు బయటకు వచ్చే పరిస్థితి ఉందని కానీ ఇతని కావాలని బిగ్బాస్ సేవ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో తెగ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇలాంటి వారు హౌస్ లో ఉండటం వల్ల స్క్రిప్టు పరంగా హౌస్ నీ నడిపించవచ్చు అన్న ఉద్దేశంతోనే… ఎలిమినేషన్ ఎపిసోడ్ లు జరుగుతున్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!