Nani: ఒకప్పుడు నేచురల్ స్టార్ నాని పక్కా కమర్షియల్ సినిమాలు కుటుంబ కథా చిత్రాలను చేసి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో నానికి పెద్దగా సూపర్ హిట్స్ దక్కడం లేదు. మంచి కథలను ఎంచుకుంటున్నా కూడా ఎందుకనో ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. శివ నిర్వాణ దర్శకుడిగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమవుతూ చేసిన సినిమా నిన్ను కోరి. ఈ సినిమా కూడా ప్రయోగమే అని చెప్పాలి. కానీ, స్క్రీన్ ప్లే..మేకింగ్..నాని – నివేతా థామస్ – ఆదీపినిశెట్టిల పర్ఫార్మెన్స్ సినిమా సక్సెస్ సాధించేలా చేశాయి.
అయితే, ఈ సినిమా తర్వాత నుంచి నాని నటించిన సినిమాలు యావరేజ్, ఫ్లాప్ లిస్ట్‌లో చేరుతున్నాయి. నాని గ్యాంగ్ లీడర్, వి, దేవదాసు, కృష్ణార్జున యుద్ధం, టక్ జగదీశ్ ఇలా చాలా సినిమాలు వరుసగా హిట్స్ అందుకోలేకపోయాయి. అయినా నాని, అటు నిర్మాత గా ఇటు హీరోగా ప్రయోగాలను చేస్తూనే ఉన్నాడు. వి సినిమాలో తన రోల్‌కు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. అయినా కూడా దర్శకుడి మీద నమ్మకంతో చేశాడు. అది ఓటీలో రిలీజ్ కావడం కూడా మైనస్ అయింది. ఇక గత ఏడాది చివరిలో రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో శ్యామ్ సింగ రాయ్ సినిమాను చేశాడు.
Nani: దసరా సినిమా పాన్ ఇండియన్ రేంజ్లో రిలీజ్ కాబోతోంది.
సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటించారు. పాజిటివ్ టాక్ వచ్చింది. నాని ఖాతాలో హిట్ పడినట్టే అనుకున్నారు. లాంగ్ రన్లో మాత్రం కాస్త కమర్షియల్‌గా మాత్రం నిరాశపరచింది. అయితే, ప్రస్తుతం దసరా సినిమాతో రాబోతున్నాడు. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ టీజర్ వచ్చి ట్రెండింగ్‌లో నిలిచింది. నాని కొత్త ప్రయోగాలను చేయడానికే రెడీ అయ్యాడని అర్థమవుతోంది. అంటే..సుందరానికి ఓ ప్రయోగమే. మరి ప్రయోగాలతో నాని హిట్స్ అందుకుంటాడా లేదా చూడాలి. కాగా, దసరా సినిమా పాన్ ఇండియన్ రేంజ్లో రిలీజ్ కాబోతోంది.