న్యూస్ సినిమా

Acharya: మెగా ఫాన్స్‌కు ఇది బ్యాడ్ న్యూసేనా..!

Share

Acharya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ఆచార్య. గత ఏడాది నుంచి ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా మెగా అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ ఎంత ఆతృత గా ఎదురు చూస్తుండగా ఎట్టకేలకు పలు వాయిదాల తర్వాత ఈ నెల 29న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే, ఇటీవల వచ్చిన ఆచార్య ట్రైలర్ కాస్త డిసప్పాయింట్ చేసింది. ఆశించినట్టుగా ట్రైలర్ లేకపోవడంతో అభిమానులే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

is-it-bad news for mega fans
is-it-bad news for mega fans

ఇలాంటి సమయంలో మరో బ్యాడ్ న్యూస్ సోషల్ మీడియాలో వచ్చి చక్కర్లు కొడుతోంది. ఆచార్య సినిమాను సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్ కొరటాల శివ రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరు తనయుడు మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా నటించాడు. ఇందులో చరణ్ సిద్ద అనే కీలక పాత్రలో నటించగా..పూజా హెగ్డే చరణ్ సరసన నటించింది. అయితే, తాజా సమాచారం మేరకు ఆచార్య సినిమాలో రామ్ చరణ్ పాత్ర నిడివి 40 నిమిషాలు వరకు రాగా, అందులో చిరంజీవితో కలిసి కనిపించే సమయం 20 నుంచి 25 నిమిషాలట.

Acharya: రామ్ చరణ్ పాత్ర నిడివి తగ్గించడం తప్ప మరో ఆప్షన్ లేదట..

అయితే, ఇప్పుడు ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర నిడివిని కాస్త ట్రిమ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే, ఆచార్య సినిమా రన్ టైం బాగా ఎక్కువగా అయిపోడంతో రామ్ చరణ్ పాత్ర నిడివి తగ్గించడం తప్ప మరో ఆప్షన్ లేదని ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర కేవలం ఒక ఎక్స్టెండెడ్ క్యమియో పాత్రలాగే ఉండబో తోందట. ఇప్పటి వరకు వచ్చిన అప్‌డేట్స్‌తో భారీ అంచనాలున్న ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఇందులో చిరు సరసన కాజల్ హీరోయిన్‌గా నటించింది. రెజీనా కసాండ్ర, సంగీత స్పెషల్ సాంగ్స్‌లో అలరించబోతు న్నారు.


Share

Related posts

ట్విట్ట‌ర్‌లో చెన్నై ఫ్యాన్స్ సంద‌డి.. ధోనీ వెల్‌క‌మ్ బ్యాక్ అంటూ పోస్టుల ట్రెండింగ్‌..

Srikanth A

మ‌రో సౌత్ రీమేక్‌కి అక్ష‌య్ సిగ్న‌ల్‌

Siva Prasad

శ్ర‌ద్ధ సంత‌కాలు చేసేస్తోంది

Siva Prasad