న్యూస్ సినిమా

KGF 2 – Salaar: ‘కేజీఎఫ్ 2′ ఎఫెక్ట్…’సలార్’ స్క్రిప్ట్‌లో భారీ ఛేంజెస్…!

Share

KGF 2 – Salaar: ‘కేజీఎఫ్ 2′ ఎఫెక్ట్…’సలార్’ స్క్రిప్ట్‌లో భారీ ఛేంజెస్…అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఇది నెగిటివ్ వార్త కాదు..ప్రభాస్ అభిమానులు సంబర పడేదే. సెన్షేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ కేజీఎఫ్ 2 భారీ సక్సెస్ సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అందరూ హిట్ అవుతుంది అనుకున్నారు. కాని, ఈ రేంజ్ హిట్ అవుతుందని మాత్రం ఊహించలేదు. అయితే, ఇప్పుడు ఈ సినిమా భారీ సక్సెస్ సాధించడంతో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ మీద అంచనా లు అమాంతం పెరిగిపోయాయి.

is it because of kgf-2-salaar-script is modified
is it because of kgf-2-salaar-script is modified

దాంతో ఇప్పుడు స్క్రిప్ట్‌లో భారీ ఛేంజెస్ చేస్తూ అప్ గ్రేడ్ చేయాల్సి వచ్చిందట. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్‌ను అలాగే బడ్జెట్ కాకుండా బాగా పెంచినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ ఇప్పుడు ప్రభాస్ కోసం హై ఓల్టేజ్ యాక్షన్స్ సీన్స్‌ను ఇంకా యాడ్ చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం సలార్ మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. 2023 సంవత్సరంలోనే రాబోతున్న అత్యంత భారీ ఇండియన్ సినిమాగా సలార్ చిత్రాన్ని చూస్తున్నారు. ఇక కేజీఎఫ్ సక్సెస్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ – ప్రభాస్ ల సలార్ మీద వసూళ్ల పరంగా ఊహకందని అంచనాలున్నాయి.

KGF 2 – Salaar: దాంతో ప్రభాస్‌లో కసి పెరిగింది.

ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీని ఈసారి ప్రభాస్ సలార్ సినిమాతో గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. సాహో అక్కడ సాధించిన విజయం అందరికీ గుర్తుంది. కానీ, రాధే శ్యామ్ మాత్రం ఈ విషయంలో తీవ్రంగా నిరాశ పరిచింది. అందుకే ఇప్పుడు సలార్ మీదే ప్రభాస్ – ప్రశాంత్ నీల్ బాగా ఫోకస్ పెట్టారు. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చిత్రాలు హిందీ బెల్ట్‌లో భారీగా వసూళ్ళు రాబట్టాయి. దాంతో ప్రభాస్‌లో కసి పెరిగింది. అందుకే ఇంత పట్టు పట్టారు. చూడాలి మరి సలార్ ప్రభాస్‌కు ఏ రేంజ్ సక్సెస్ ఇస్తుందో.


Share

Related posts

Pushpa : పుష్ప నుంచి ‘దాక్కో దాక్కో మేకా ప్రోమో సాంగ్ రిలీజ్

GRK

Anchor Rashmi: ర‌ష్మీ ఇది టూ మ‌చ్‌.. అంత పెద్ద ర‌హ‌స్యాన్ని ఇన్నాళ్లు దాచేశావా..?

kavya N

2000 జాబ్స్ .. అప్లై చేస్తారా మరి..!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar