RRR: అనవసరంగా ఈ సమయంలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి సాంగ్ రిలీజ్ చేయడం కరెక్ట్ కాదా ..? అంటే ఇప్పుడు నెటిజన్స్ దీనిపై కరెక్ట్ కాదనే అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారట. రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన ఈ భారీ పాన్ ఇండియా సినిమా ఇదే నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెల్సిందే. అత్యంత భారీ అంచనాల మద్య రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమాపై ఉన్న అంచనాలు ఇంకా పెంచేందుకు భారీ స్థాయి ప్రమోషన్స్ ప్లాన్ చేశారు మేకర్స్.
దీనిలో భాగంగానే ఈ నెల 14న ‘ఎత్తర జెండా’ అంటూ సాగే పాటను విడుదల చేయబోతున్నట్లు రాజమౌళి బృందం ఇటీవలే ప్రకటించింది. ఈ క్రమంలో ఈ పాట ప్రోమోను వదిలారు. ‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా’ అంటూ సాగే ఈ పాటలో తారక్ – చరణ్ – ఆలియా కనిపించగా జస్ట్ 20 సెకన్ల విజువల్స్ మెగా – నందమూరి అభిమానులను అలరించింది. ముగ్గురు క్రేజీ స్టార్ కనిపించే సాంగ్ ఎలా ఉంటుందో అని అభిమానులు ఆతృత గా ఎదురు చూస్తున్నవేళ నెటిజన్స్ మాత్రం నెగిటివ్‌గా కామెంట్స్ చేస్తున్నారు.
RRR: జస్ట్ ప్రోమోకే నెగిటివ్ కామెంట్స్ వచ్చిన ఈ పాటను మూవీలో ఉంచుతారా..!
ఇది ఏదో జాతరలో ఉన్నట్టుగా ఉంది తప్ప మెలోడియస్గా మరీ ముఖ్యంగా కీరవాణి స్థాయిలో గానీ ఆయన శైలిలో గానీ లేదని మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు..భారీ అంచనాలున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఇలాంటి సమయంలో ఇంత పేలవంగా ఉన్న సాంగ్‌ను వదలడం ఏంటీ అని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి ఫుల్ విజువల్స్ వస్తే గానీ, ఈ సాంగ్ ఎంత కలర్ఫుల్గా ఉంటుందనేది తెలియదు. చూడాలి మరి జస్ట్ ప్రోమోకే నెగిటివ్ కామెంట్స్ వచ్చిన ఈ పాటను మూవీలో ఉంచుతారా లేక తీసేస్తారా.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?