సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ పంథానే వేరు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కరోనా తో అందరు భయపడుతూ షూటింగ్స్ ఎలా చేయాలి అంటూ వణికిపోతుంటే ఆయన మాత్రం నెలకొక సినిమా తీసి సొంతగా రిలీజ్ చేస్తున్నారు. గత నెల మియా మాల్కోవాతో క్లైమాక్స్ అనే సినిమా తీసి రిలీజ్ చేశాడు. రూ.100 తో ఆన్ లైన్ లో చూసేలా రిలీజ్ చేశాడు. అసలు వర్మకి ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో తెలీదు గాని..ఈ సినిమాని 100 ఏ కదా అని ఎగబడి చూశారు. తీరా చూశాక అబ్బా అనవసరంగా నా 100 రూపాయలు వేస్ట్ అయిందే ..అని బుర్ర గోక్కున్నారు.
ఏదో ఊహించి రూ 100 పెడితే గిట్టుబాటు కాలేదన్నది ప్రేక్షకుడి ఆలోచన. ఇలా ఆలోచనలో ఉన్న ప్రేక్షకులకి నగ్నం అంటూ మళ్ళీ టీజర్ ని వదిలి వేడెక్కించాడు. కెమెరా ఎక్కడ పెట్టకూడదో అక్కడ పెట్టి ఏదో అద్భుతం చూపిస్తున్నట్టుగా జనాలని వెర్రి వాళ్ళని చేశాడు. వెర్రి వాళ్ళు అయినా మళ్ళీ మామూలే..మళ్ళీ ఏదో ఉందని కట్టలు తెంచుకున్న ఆవేశంతో ఈ నగ్నం ఎప్పుడు రిలీజ్ చేస్తాడో అని ఎదురు చూశారు. ఎందుకంటే రూ 100 ఏ కదా అని. కాని ఈ సారి వర్మ రేటు పెంచి రూ 100 ని కాస్త రూ 200 చేశాడు.
అయినా జనాలు థియోటర్స్ కి వెళ్ళి చూస్తే రూ 400 ఖర్చు అవుతుంది. అంటే 200 మిగిలినట్టేగా అంటూ మళ్ళీ నగ్నం సినిమాని ఎగబడి చూశారు. ఈ సారి కూడా అదే తంతు. ఏమీ లేని సినిమాని ఏదో ఉన్నట్టు టీజర్ .. ట్రైలర్ కట్ చేసి ..జనాలని వెర్రోళ్ళని చేసి 200 తగలేయించాడని మళ్ళీ టాక్. వర్మ సంగతి తెలిసిందే. ఆయన ఒక స్టార్ డైరెక్టర్ స్థాయి నుంచి నగ్నం లాంటి సినిమాలు తీసే స్థాయికి ఎలా వచ్చారో. ఆయనది కమర్షియల్ బ్రేయిన్.. ఆయన ప్లేస్ లో ఎవరున్నా అలానే తీస్తారు..చూపిస్తారు. అన్ని తెలిసి మీరెందుకు చూడాలి..ఇప్పుడు మా 100..200 వేస్ట్ అయ్యాయని ఆయనని ఎందుకు అనాలి…మీ బుద్దేమయిందంటూ మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు వర్మ తీస్తున్న సినిమాలకి రూ 100 పెట్టడం కూడా దండగే అనమాట.