KGF 2: కన్నడ రాకింగ్ స్టార్ యష్‌కు కేజీఎఫ్ ఛాప్టర్ 1 పాన్ ఇండియా లెవల్లో ఎంత క్రేజ్ తీసుకువచ్చి పెట్టిందో అందరికీ తెలిసిందే. ఉగ్రం సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సౌత్ భాషలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ మార్కెట్లో కూడా సత్తా చాటింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కేజీఎఫ్ 1 ఇంతటి సంచలన విజయాన్ని అందుకుంటుందని ఎవరూ ఊహించలేదు. అందుకే ఇప్పుడు రూపొందిన కొనసాగింపు కేజీఎఫ్ ఛాప్టర్ 2 మీద అసాధారణమైన అంచనాలు నెలకొన్నాయి.
అయితే, గత ఏడాది ఎప్పుడో వచ్చిన టీజర్ సంచలనం సృష్ఠించింది. కానీ, ఆ తర్వాత మళ్ళీ కేజీఎఫ్ 2 నుంచి ఎలాంటి సాలీడ్ అప్డేట్ రాలేదు. దాంతో అభిమానుల్లోనే కాక కాస్త ప్రేక్షకుల్లోనూ అంచనాలు తగ్గాయి. అయితే ఆ అంచనాలను అనూహ్యంగా తాజాగా చిత్రబృందం వదిలిన థియేట్రికల్ ట్రైలర్‌తో రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు అందరూ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చెప్పాలంటే గత ఏడాది వచ్చిన టీజర్‌తో గ్యారెంటీగా కేజీఎఫ్ 2 బాహుబలి 2 రికార్డ్స్‌ను బద్దలు కొడుతుందని భావించారు.
KGF 2: రికార్డ్స్ పరంగా ఆర్ఆర్ఆర్ను బీట్ చేయడం గ్యారెంటీ..!
కానీ, ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ అన్నీ రికార్డ్స్‌ను బద్దలు కొట్టి బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డ్స్‌ను కేజీఎఫ్ సీక్వెల్ బ్రేక్ చేస్తుందని తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ మూవీకి ఒరిజినల్ వెర్షన్ కన్నడలో కంటే తెలుగు, హిందీలో భారీ స్థాయిలో క్రేజ్ నెలకొంది. అందుకే ఇప్పుడు అందరూ రికార్డ్స్ పరంగా ఆర్ఆర్ఆర్ను బీట్ చేయడం గ్యారెంటీ అంటున్నారు. చూడాలి మరి వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్న కేజీఎఫ్ 2 ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో.