Mahesh: మహేశ్ ఈ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేసిందే నిజమైతే ప్రభాస్ మార్క్‌ను టచ్ చేయడం అసాధ్యమే..!

Share

Mahesh: సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా అంటే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అండ్ అంచనాలు వేరే లెవల్. ఇక అది పాన్ ఇండియన్ సినిమా అయితే చెప్పడం చాలా కష్టం. ఇక మహేశ్ పౌరాణిక సినిమా చేసే అవకాశం వస్తే వదులుకుంటాడా అంటే తండ్రి సూపర్ స్టార్ కృష్ణ చేసిన ప్రయోగాలను దృష్ఠిలో ఎట్టి పరిస్థితుల్లో వదులుకోడు. ప్రస్తుతం ప్రభాస్ మాదిరిగా అందరూ పాన్ ఇండియన్ సినిమాలను చేయడానికి ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియన్ స్టార్‌గా అల్లు అర్జున్ పుష్ప సినిమాతో విపరీతంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఆ పాన్ ఇండియన్ స్టార్ అనే క్రేజ్ సాధించుకోవడం గ్యారెంటీ.

is mahesh-rejected this project....!
is mahesh-rejected this project….!

ఈ విషయం ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, వీడియోస్ సహా అన్నీ అప్‌డేట్స్‌తో అందరూ ఫిక్స్ అయ్యారు. దాంతో మహేశ్ బాబు కూడా పాన్ ఇండియన్ సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం మహేశ్ బాబు సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఇది మంచి కమర్షియల్ సినిమాగానే రూపొందిస్తున్నారని అనుకున్నారు. కానీ, ఇటీవల మాత్రం ఈ సినిమాను పాన్ ఇండియన్ సినిమాగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, మధు మంథెన కలిసి 500 కోట్ల భారీ ప్రాజెక్ట్‌గా రామాయాణం చిత్రాన్ని నిర్మించాలని ప్లాన్ చేశారు.

Mahesh: ఇలాంటి ప్రాజెక్ట్ మహేశ్ వదులుంటే ప్రభాస్ రేంజ్‌కు రావడం కష్ఠమా..!

ఈ మేరకు అప్పట్లో ఓ ప్రకటన కూడా వచ్చింది. ఈ సినిమాను పాన్ ఇండియన్ సినిమాగా అన్నీ సౌత్ భాషలతో పాటు బాలీవుడ్‌లో కూడా రిలీజ్ చేయాలనుకున్నారు. ఇక ఇందులో మహేశ్ రాముడిగా కనిపించబోతున్నాడని..ఈ ప్రాజెక్ట్‌కు దర్శకుడిగా ఎస్ ఎస్ రాజమౌళి వ్యవహరించబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఓ కొత్త టాక్ వినిపిస్తోంది. రాజమౌళి అంటే మరో ప్రాజెక్ట్ చేసే వీలుండదు. హీరోలు ఒకే ప్రాజెక్ట్‌లో హోల్డ్ అవ్వాలి. కానీ, మహేశ్ అలా హోల్డ్ అవదలచుకోలేదని..అందుకే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని అంటున్నారు. ఇక ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో రాముడిగా నటిస్తున్నాడు. ఇది పాన్ వరల్డ్ సినిమా. కానీ, ఇలాంటి ప్రాజెక్ట్ మహేశ్ వదులుంటే ప్రభాస్ రేంజ్‌కు రావడం కష్ఠమని చెప్పుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో చూడాలి.


Share

Related posts

mamata benerji: అనుకున్నంత అయింది… మోడీకి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన మ‌మ‌త‌

sridhar

Nidhi agarwal :నిధి అగర్వాల్ ఫేట్ మార్చబోతున్న పవన్ కళ్యాణ్?

GRK

Manchu Manoj: పెళ్ళి కొడుకు కాబోతున్న మంచు మనోజ్…అమ్మయి ఎవరంటే??

Naina