Prabhas – Maruthi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా త్వరలో మారుతి దర్శకత్వంలో కొత్త సినిమా మొదలవబోతోంది. అసలు టైటిల్ ఇదో కాదో తెలీదు గానీ గత కొన్ని రోజుల నుంచి మాత్రం ఈ కాంబోకు ‘డీలక్స్ రాజా’ టైటిల్ ఫిక్స్ చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న అగ్ర నిర్మాత డి.వి.వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ కోసం ఓ భారీ సెట్ ని కూడా నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ న్యూస్ వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఎప్పుడు స్క్రిప్ట్ విషయంలో మారుతి ఇతర రైటర్స్ మీద ఆధారపడకుండా సినిమాలు తీసి హిట్స్ కొట్టాడు. సినిమా తర్వాత సినిమాను చాలా పక్కాగా తయారు చేసుకొని సెట్స్ మీదకు వస్తుంటాడు. కానీ, మొదటిసారి ప్రభాస్ సినిమాకు కాస్త ఒత్తిడికి గురై ఇతర రైటర్లతో చర్చలు జరిపి స్క్రిప్ట్ సిద్దం చేసుకుంటున్నాడట. దీనికి కారణం ప్రభాస్‌కు బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ ఫ్లాప్స్ పడటమే. సాహో – రాధే శ్యామ్ సినిమాలు రెండూ కూడా భారీ అంచనాల మధ్యన వచ్చి అభిమానులతో పాటు ప్రభాస్‌ను తీవ్రంగా నిరాశపరిచాయి.
Prabhas – Maruthi: అన్నీ రకాలుగా మారుతిపై తీవ్రమైన ఒత్తిడి ఉందా…?
దాంతో ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న సినిమాతో భారీ హిట్ కొట్టాల్సిన అవసరం అనివార్యం. ఈ బాధ్యత ఇప్పుడు మారుతిపై గట్టిగా ఉంది. ఎందుకంటే మిగతా సినిమాలు ఇప్పట్లో వచ్చేవి కావు. ఆదిపురుష్, సలార్ సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ అవుతాయి. ప్రాజెక్ట్ కె పరిస్థితేంటో ఇప్పట్లో చెప్పడం చాలా కష్టం. అందుకే, కేవలం 40 రోజులు మాత్రమే ప్రభాస్ మారుతికి డేట్స్ ఇచ్చాడు. వీలైనంత త్వరగా ఈ సినిమాను కంప్లీట్ చేసి రిలీజ్ చేయాల్సి ఉంది. దాంతో అన్నీ రకాలుగా మారుతిపై తీవ్రమైన ఒత్తిడి ఉందంటూ ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.