Liger: చాలాకాలం తర్వాత టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ కొట్టి బౌన్స్‌బాక్ అయ్యాడు. దాంతో మళ్ళీ సత్తా చాటేందుకు వరుసగా సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ క్రేజీ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ మేకర్ కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై పూరి కనెక్ట్స్ కలిసి దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. పూరి – చార్మి – కరణ్ జోహార్ నిర్మాతలు.
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ముంబై వీధుల్లో ఛాయ్‌వాలాగా నటిస్తున్నాడు. ఓ ఛాయ్‌వాలా బాక్సర్‌గా ఎలా మారాడనే ఆసక్తికరమైన కథతో పూరి జగన్నాథ్ లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియన్ సినిమాగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అయితే, ఈ సినిమాలో వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించారు. ఇందులో విజయ్‌కు కోచ్‌గా కనిపిస్తారా లేదా తండ్రి పాత్రలో కనిపిస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.
Liger: విజయ్ – మైక్ టైసన్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఎమోషనల్..
అయితే, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయి పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపు కుంటోంది. ఇందులో భాగంగా మైక్ టైసన్ తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇక పూరి సినిమాలో హీరో – మదర్ లేదా ఫాదర్ సెంటిమెంట్ బాగా పండుతుంది. అలాంటి సన్నివేశాలు లైగర్ సినిమాలో కూడా ఉన్నాయట. ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుకున్న సమాచారం మేరకు విజయ్ – మైక్ టైసన్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా.. సినిమాకే హైలెట్‌గా నిలవనున్నట్టు తెలుస్తోంది. ఇక మొదటి సారి సౌత్ సినిమాలలో మైక్ టైసన్ కనిపించబోతుండటం కూడా సినిమాకు బజ్ బాగా క్రియేట్ అవుతోంది.