న్యూస్ సినిమా

Mahesh – Trivikram: మహేశ్ – త్రివిక్రమ్ సినిమాలో ఈ సీనియర్ హీరో ఉంటే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షమే..కానీ, ఆయనొప్పుకోవాలి..!

Share

Mahesh – Trivikram: మహేశ్ – త్రివిక్రమ్ సినిమాలో ఈ సీనియర్ హీరో ఉంటే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షమే.. కానీ, ఆయనొప్పుకోవాలి..! అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ సీనియర్ హీరో మరెవరో కాదు కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. అతడు హిట్ సాధించగా, ఖలేజా మాత్రం ఆశించిన సక్సెస్ సాధించలేకపోయింది. కానీ, పర్ఫార్మెన్స్ పరంగా మహేశ్‌కు..మేకింగ్ పరంగా దర్శకుడు త్రివిక్రమ్ కి మంచి పేరొచ్చింది. ఇక అతడు, ఖలేజా చిత్రాలు బుల్లితెర మీద ఎప్పుడొచ్చినా హైయ్యెస్ట్ రేటింగ్ నమోదు చేస్తున్నాయి. అంతగా బుల్లితెర మీద ఈ సినిమాను ఆదరించే అభిమానులున్నారు.

is mohan babu going to act with mahesh babu
is mohan babu going to act with mahesh babu

ఇలాంటి క్రేజీ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవి రాబోతుందంటే ఇటు మహేశ్ అభిమానుల్లో, కామన్ ఆడియన్స్‌లో అటు త్రివిక్రమ్ అభిమానుల్లో..ఇండస్ట్రీ వర్గాలలో ఉండే అంచనాలు ఆకాశం అంత ఎత్తులో ఉంటాయి. అసలే గత నాలుగైదేళ్ళుగా మహేశ్ వరుస సక్సెస్‌లతో మాంచి దూకుడు మీదున్నాడు. ప్రస్తుతం భారీ అంచనాలతో సర్కారు వారి పాట సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీస్, 14 రీల్స్ సంస్థలతో కలిసి మహేశ్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్థిక కుంభకోణం అనే యూనివర్సల్ కథాంశంతో సర్కారు వారి పాట తెరకెక్కుతోంది.

Mahesh – Trivikram: నిజంగా మోహన్ బాబు ఒప్పుకుంటే మాత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని వసూళ్ళు..

పరశురామ్ దర్శకత్వంలో నిర్మితమవుతున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్ హిరోయిన్‌గా నటిస్తోంది. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. దీని తర్వాత మహేశ్ చేస్తున్న సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే. ఇందులో మోహన్ బాబు మహేశ్ బాబుకి మావయ్యగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు లేటెస్ట్ న్యూస్. త్రివిక్రమ్ సినిమాలలో ఇప్పటికే పలువురు సీనియర్ నటులు అద్భుతమైన పాత్రలు చేసి ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు మహేశ్ సినిమాలో మోహన్ బాబు అంటే ఖచ్చితంగా త్రివిక్రమ్ ఆయన పాత్రను చాలా గొప్పగా తయారు చేసి ఉంటారని చెప్పుకుంటున్నారు. నిజంగా మోహన్ బాబు గనక ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంటే మాత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని వసూళ్ళు రాబట్టడం గ్యారెంటీ అంటున్నారు.


Share

Related posts

Bigg Boss: బిగ్ బాస్ సెట్ ను సీల్ చేసిన పోలీసులు..! లక్ష ఫైన్..

Muraliak

క్రిష్ సినిమా సెట్ లోకి పవన్ కళ్యాణ్..??

sekhar

Ap Assembly: ఏపీ బడ్జెట్ పై జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ సెటైర్లు..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar