Samantha – Naga Chaithanya: సమంతపై కసి తీర్చుకుంటున్న నాగ చైతన్య.. ఇలా దెబ్బకొట్టబోతున్నాడా..? అని ప్రస్తుతం నెటిజన్స్, చైతు ఫ్యాన్స్ మాట్లాడుకుంటు న్నారట. దీనికి కారణం లేకపోలేదు. సమంత, చైతూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. గోవాలో అంగరంగ వైభవంగా రెండు మత సాంప్రదాయాల ప్రకారం అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటుగా టాలీవుడ్ – కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ తారలు హాజరయ్యారు. ఇంత ఘనంగా పెళ్లి చేసుకున్న వీరు నాలుగేళ్ళకు అనూహ్యంగా విడిపోవడం అభిమానులను బాధించింది.
ఇక ఎప్పుడైతే ఇద్దరూ విడిపోతున్నట్టు ప్రకటించారో..ఆ రోజు నుంచి ఎక్కువగా నెటిజన్ బారిన పడి ట్రోల్స్‌కు గురైంది సమంతనే. చైతూని 10 పర్సెంట్ కామెంట్స్ చేస్తే సమంతనే 90 శాతం మంది ట్రోల్ చేసి ఇబ్బంది పెట్టారు. వీటన్నిటికీ విసిగిపోయింది. మొత్తానికి ఎలాగోలా మళ్ళీ కెరీర్ మీద దృష్ఠి సారించిన సమంత ..నాగ చైతన్య మీద కసి తీర్చుకు నేందుకే అన్నట్టుగా బోల్డ్ పాత్రలను కూడా ఒప్పుకుంటూ షాకిచ్చింది. విడాకుల ముందు కమిటైన శాకుంతలం, ఆ తర్వాత ఒప్పుకున్న యశోద, హాలీవుడ్ బోల్డ్ మూవీ సహా మరికొన్ని ప్రాకెక్ట్స్ను లైన్లో పెట్టింది. ముఖ్యం సమంత బోల్డ్ ఫొటో షూట్స్ అందరి ని విస్మయానికి గురి చేస్తున్నాయి.
Samantha – Naga Chaithanya: నెటిజన్స్ అనుకోవడం కరెక్టేనేమో.
అయితే, సైలెంట్‌గా ఉన్న నాగ చైతన్య తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా సమంతని మించి ఉండేలా క్రేజీ డైరెక్టర్స్‌ను లైన్లో పెట్టాడట. ఇప్పటికే తెలుగులో ఒకటి హిందీలో ఒకటి రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఈ మధే డిజిటల్ ఎంట్రీ ఇచ్చి దూత అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. తాజాగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఓ సినిమాను చేసేందుకు అఫీషియల్‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే, సర్కారు వారి పాట తర్వాత పరశురామ్ పెట్లాతో ఒక సినిమాను, విజయ్ కనకమేడల, కిషోర్ తిరుమల, రాహుల్ సంకృత్యాన్ లాంటి యంగ్ అండ్ క్రేజీ డైరెక్టర్స్‌తో సినిమాలను చేయబోతున్నాడట. ఈ లిస్ట్ చూస్తే
సమంత కంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ చైతూ లైన్లో పెట్టాడనుకోవాలి. మొత్తానికి సమంత మీద ఇలా కసి తీర్చుకుంటున్నాడా అని నెటిజన్స్ అనుకోవడం కరెక్టేనేమో.