NANI: నేచురల్ స్టార్ నానీ, నిఖిల్ లాంటి యంగ్ హీరోలు కూడా ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్‌గా క్రేజ్ కోసం ఆరాటపడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియన్ స్టార్స్‌గా మారి నెక్స్ట్ ఇలాంటి ప్రాజెక్ట్స్‌నే సెట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్స్‌గా యంగ్ హీరోలు కూడా రేసులోకి వస్తున్నారు. నేచురల్ స్టార్‌గా నాని కెరీర్ ప్రారంభం నుంచి మంచి కథా బలమున్న సినిమా లను చేస్తూ వస్తున్నాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
బాక్సాఫీస్ వద్ద నాని సినిమాలు మినిమం గ్యారెంటీగా నిలుస్తున్నాయి. అందుకే, నానితో సినిమాలు తీసేందుకు నిర్మాతలు క్యూ కడుతుంటారు. ఎప్పుడూ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఒక సినిమా పూర్తవగానే రెండు సినిమాలను ప్రకటిస్తున్నాడు. అలా నాని కెరీర్ బ్రేక్ లేకుండానే సాగుతోంది. ప్రస్తుతం నాని నటించిన అంటే సుందరానికీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. జూన్ 10వ తేదీన రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమాను మూడు భాషలలో రిలీజ్ చేస్తున్న చిత్ర బృందం ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళంలో..మలయాళంలో కూడా రిలీజ్ చేస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
NANI: దసరా సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్..
తమిళంలో “అతడే సుందర”, మలయాళంలో “ఆహా సుందర” పేర్లతో రిలీజ్ కాబోతుంది. అయితే, సౌత్ భాషలలో కంటే హిందీలో మార్కెట్ రేంజ్ ఎక్కువగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, నాని..హిందీ వదిలేసి ఇలా తమిళం, మలయాళంలో మాత్రమే రిలీజ్ చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఇలా అయితే, నాని పాన్ ఇండియన్ మార్కెట్‌ను ఎలా టార్గెట్ చేస్తాడని చర్చించుకుంటున్నారు. ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తే ఆ తర్వాత రూపొందనున్న దసరా సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ క్రేజ్ అప్పటికి ప్లస్ అవుతుందని అంటున్నారు. మరి నాని తన అంటే సుందరానికీ హిందీలో కూడా రిలీజ్ చేస్తారా లేదా చూడాలి.