సినిమా

Niharika: నిహారిక రియలైజయిందా? తన పోస్టు ద్వారా ఏం చెబుతోంది?

Share

Niharika: మెగా వారసురాలు కొణిదెల నిహారిక గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తొలుత నిహారిక యాంకర్‌గా తన కెరీర్‌ ని మొదలుపెట్టారు. ఢీ జూనియర్ 1, ఢీ జూనియర్ 2 షోలతో మంచి గుర్తింపే సంపాదించుకున్నారు. తన అందమైన నవ్వు, చిలిపి, చలాకీ మాటలతో అందరినీ కట్టిపడేసారు. ఇక నాగశౌర్య హీరోగా వచ్చిన ‘ఒక మనసు’ చిత్రంతో ఆమె హీరోయిన్‌గా అవతారమెత్తారు. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా, ఆమె నటనకు మంచి పేరే వచ్చింది. దాని తరువాత చేసిన ‘సూర్యకాంతం’ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయినప్పటికీ, ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

Is Niharika Realized ?
Is Niharika Realized ?

Niharika: నిహారిక నిర్మాతగా మారారా?

సినిమాలు పెద్దగా ఆడకపోవడం వలన నిహారిక ప్రస్తుతం నిర్మాతగా మారి ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌పై తెలుగు వెబ్ సిరీస్ ‘ముద్దపప్పు ఆవకాయ్‌’ను నిర్మించారు. ఈ సిరీస్ యూట్యూబ్‌లో విడుదలై మంచి మన్ననలు పొందింది. ఈ మధ్యలో 2020 డిసెంబర్ 9న ‘చైతన్య జొన్నలగడ్డ’ను వివాహం చేసుకున్నారు నిహారిక. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేయకపోయినా వెబ్ సిరీస్‌లలో నటిస్తానని.. నిర్మాతగా సినిమాలను కూడా నిర్మిస్తానని గతంలోనే ప్రకటించారు. చెప్పినట్టే ఇటీవలే నిర్మాతగా మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసారు.

Is Niharika Realized ?
Is Niharika Realized ?

నిహారిక పోస్టులో ఏముంది?

బేసిగ్గా సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే నిహారిక, ఈమధ్య కాస్త నెమ్మదించింది. ఇటీవల జిమ్‌లో షేర్‌ చేసిన ఓ వీడియోపై విపరీతంగా ట్రోల్స్‌ రావడంతో సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిన మెగా డాటర్.. ఉన్నపళంగా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను డిలీట్‌ చేసేసింది. తరువాత ఇంటికే పరిమితమైన నిహారిక.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి రీఎంట్రీ ఇచ్చి ఓ పోస్ట్‌ చేసింది. ఈ క్రమంలో ఈ 8 వారాల్లో తాను నేర్చుకున్న మూడు పాఠాలను అభిమానులతో పంచుకున్నారు.

1) ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదు.
2) ఇతరులు ఏం చేస్తున్నారన్నది నేను అస్సలు పట్టించుకోను.
3) ఇప్పుడు నేను నిజంగా రీఫ్రెష్ అయ్యాను. పోస్టులు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాను.

అంటూ నిహారిక చేసిన పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అయింది. దానికి నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అనేకమంది ‘నిన్ను చాలా మిస్సయ్యాం వెల్ కం’ అంటూ పోస్టులు చేయగా కొంతమంది.. ‘నిహారికలో మునుపటితో పోలిస్తే ఇప్పుడు చాలా మార్పు వచ్చింది!’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


Share

Related posts

బిగ్ బాస్ 4 : మోనాల్ హై డ్రామా! చేతిలో సంతకాలు.. మండిపడుతున్న నెటిజన్లు

Teja

Prabhas: ప్రభాస్ రాబోయే మూవీలో “చత్రపతి” తరహాలో షిప్ సన్నివేశాలు..డిఫరెంట్ కాన్సెప్ట్!!

sekhar

Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కెరీర్లో నటించడానికి ఇబ్బంది పడ్డ సీన్ అదేనట..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar