NTR – Bucchibabu: ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ నెల 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 14 భాషలలో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానులు యూఎస్‌లో భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఏకంగా అభిమానులందరు కలిసి ఓ షో మొత్తానికి టికెట్ బుక్ చేసుకోవడం..ఓ అభిమాని ఏకంగా 75 టికెట్స్ కొనడం లాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో సర్ప్రైజ్ చేస్తున్నారు. ఇక తారక్ కెరీర్లోనే ఈ సినిమా ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెప్పుకుంటున్నారు.
ఇక ఎన్టీఆర్ కూడా ఈ సినిమా విడుదల కోసమే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. కాగా, చరణ్ దర్శకుడు రాజమౌళితో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగబోతున్నాడు. మరోసారి ముంబై, చెన్నై, బెంగుళూరు, హైదరాబద్లలో భారీ స్థాయిలో ప్రమోషన్స్ ను నిర్వహించనున్నారు. ఇక తారక్ నెక్స్ట్ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. దీనిని కూడా పాన్ ఇండియా సినిమాగానే ప్లాన్ చేశారు.
NTR – Bucchibabu: ఈ ఏడాదిలో తారక్ రెండు సినిమాలని సెట్స్ మీదకు తీసుకురానున్నారు.
ఈ మూవీ కొరటాల మార్క్ ఎంటర్టైన్మెంట్తో పాటు సామాజిక సందేశంతో రూపొందబోతోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో కొరటాల స్నేహితుడు, కళ్యాణ్ రామ్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో కథానాయికగా అలీయా భట్ ఫైనల్ అయిది. ఇదే క్రమంలో ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించనున్న సినిమాలో నటించనున్నాడు తారక్. ప్రస్తుతం దీనికి పెద్ది అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు కుదిరితే ఈ ఏడాదిలోనే సెట్స్ మీదకు రానున్నట్టు తాజా సమాచారం. దీనిని బట్టి చూస్తే ఈ ఏడాదిలో తారక్ రెండు సినిమాలని సెట్స్ మీదకు తీసుకురానున్నారనమాట.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?