న్యూస్ సినిమా

Pawan kalyan: పవన్ కళ్యాణ్‌కు అంత అవసరం ఉండదేమో అంటున్న ఫ్యాన్స్..

Share

Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అంటే జనాలు ఏదీ లెక్క చేరనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆఫీసులు, వ్యాపారాలు మానేసుకొని మరీ థియేటర్స్ ముందు వాలిపోతారు. స్టూడెంట్స్ కాలేజీలు బంక్ కొట్టి రచ్చ చేయడానికి రెడీ అయిపోతారు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్ కోసం తీవ్రంగా పోటీ పడుతుంటారు. మొత్తంగా పవర్ స్టార్ సినిమా రిలీజ్ రోజున బాక్సాఫీస్ వద్ద పెద్ద సునామీలా తయారవుతుంది. అయితే ఆయన తాజా చిత్రం భీమ్లా నాయక్ సినిమా గురించి నిరాశపరచే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

is-pawan-kalyan-bheemla-nayak-movie-postponed
is-pawan-kalyan-bheemla-nayak-movie-postponed

కరోనా థర్డ్ వేవ్ కారణంగా ఇప్పటికే సంక్రాంతి బరి నుంచి పాన్ ఇండియన్ సినిమాలు తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈ సినిమాలను ఎప్పుడు రీ షెడ్యూల్ చేస్తారో తెలీదు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాను ఫిబ్రవరి నుంచి పోస్ట్ పోన్ చేసి ఏప్రిల్ 1కి మళ్ళీ రీ షెడ్యూల్ చేశారు. ఏప్రిల్ 1కి రిలీజ్ కావాల్సిన మహేశ్ బాబు సర్కారు వారి పాట చిత్రాన్ని ఏప్రిల్ 1నుంచి మళ్ళీ రీ షెడ్యూల్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఆచార్య ఆ డేట్‌ను లాక్ చేసుకున్నారట.

Pawan kalyan: ఏప్రిల్ 14న కేజీఎఫ్ 2, బీస్ట్ చిత్రాలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాను కూడా ఆచార్య సినిమా మాదిరిగా పోస్ట్ పోన్ చేసి ఏప్రిల్ నెలకు రీ షెడ్యూల్ చేస్తారని తాజాగా టాక్ వినిపిస్తోంది. ఏప్రిల్ 1న ఆల్రెడీ ఆచార్య వస్తోంది. ఏప్రిల్ 14న కేజీఎఫ్ 2, బీస్ట్ చిత్రాలు ఉన్నాయి. మరి ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో భీమ్లా నాయక్ వస్తే సరిపోతుంది. లేదంటే ఏప్రిల్ చివరి వారం డేట్ ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడాలి మరి మేకర్స్ ఎలా ప్లాన్ చేస్తారో. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం భీమ్లా నాయక్ సినిమాను పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. మళ్ళీ పోస్ట్ పోన్ అనకుండా ఫిబ్రవరి 25నే రిలీజ్ చేయాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.


Share

Related posts

సర్కారు వారి పాట ..సూపర్ స్టార్ అంటే చిన్న విషయం కాదు ..!

GRK

వయాగ్రా ను మించిన పవర్ మీకు కావాలంటే ఇలా చేసి చూడండి… ఇక మీకు తిరుగే ఉండదు !! (పార్ట్ -2)

siddhu

Corona Vaccine: మాకు ఆ వెసులుబాటు ఇవ్వండి..! కేంద్రం వద్ద సీరం పేచీ..!!

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar