Pawan kalyan: పవన్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. భీమ్లా నాయక్ హిందీ రిలీజ్ లేనట్టేనా..? అంటే ప్రస్తుతం దీనికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. ఈ మధ్య మన తెలుగు సినిమాలన్నీ దాదాపు హిందీతో పాటు మిగతా సౌత్ భాషలలోనూ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప హిందీలో రిలీజై 100 కోట్ల మార్క్‌ను టచ్ చేసి అందరికీ షాకిచ్చింది. ఎలాంటి ప్రమోషన్స్, అంచనాలు లేకుండా హిందీ వెర్షన్లో పుష్ప ఈ రేంజ్ సక్సెస్ అందుకుందంటే చాలా గొప్ప విషయం. ఇక ఇప్పుడు రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాలు హిందీలో రిలీజ్ చేయనున్నారు.
అయితే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించగా గత నెలలో వచ్చి సెన్సేషన్ సృష్ఠించిన సినిమా ‘భీమ్లానాయక్’ కూడా హిందీలో రిలీజ్ కావాల్సింది. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు అఫీషియల్ తెలుగు రీమేక్‌గా రూపొందించిన ఈ సినిమాలో రానా మరో హీరోగా నటించాడు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా కనిపించారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించగా, ఎస్ ఎస్ థమన్ సంగీతం
అందించాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించాడు. ఏపీలో టికెట్ రేట్ల సమస్య ఉన్నా కూడా భారీ సక్సెస్ సాధించింది.
Pawan kalyan: వచ్చే నెలలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్..!
అయితే, మార్చి నెలలో ‘భీమ్లానాయక్’ సినిమాను హిందీలో రిలీజ్ చేయాలనుకున్నారు చిత్రబృందం. ఈ నేపథ్యంలో ఇటీవలే హిందీ వెర్షన్ థియేట్రికల్ ట్రైలర్ కూడా వదిలారు. ఈ ట్రైలర్‌కు బాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ దక్కింది. దాంతో ఎప్పుడెప్పుడూ హిందీలో ‘భీమ్లానాయక్’ రిలీజ్ అవుతుందా అని అక్కడ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ‘భీమ్లానాయక్’ హిందీలో రిలీజ్ చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. మరో టాక్ ప్రకారం వచ్చే నెలలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు చెప్పుకుంటు న్నారు. మరి దీనిపై క్లారిటీ ఎప్పుడిస్తారో చూడాలి. కాగా, తాజాగా ‘భీమ్లానాయక్’ ర్యాప్ సాంగ్ వచ్చి అదరగొడుతోంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!