Prabhas – Sujeeth: రన్ రాజా రన్, సాహో ఫేమ్ సుజీత్ సాలీడ్ ప్రాజెక్ట్ కోసం ఎంత గానో ఎదురుచూస్తున్నాడు. సాహో తర్వాత మళ్ళీ ఈ కుర్ర దర్శకుడికి అవకాశం రానేలేదు. ప్రభాస్..రామ్ చరణ్ క్లోజ్ కాబట్టి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాకు దర్శకుడిగా సుజీత్‌ను ఎన్నుకున్నారు. దాదాపు 6 నెలలు సుజీత్ ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశాడు. కాని, మలయాళ వెర్షన్‌ను తెలుగు వెర్షన్‌కు మార్చే విధానం లో సుజీత్..మెగాస్టార్‌ను మెప్పించలేకపోయాడు. దాంతో ఈ ప్రాజెక్ట్ సుజీత్ చేతి నుంచి జారిపోయింది. మళ్ళీ ఇప్పటి వరకు సుజీత్ చేతికి కొత్త ప్రాజెక్ట్ అనేదే రాలేదు.

ఆ మధ్య మళ్ళీ ఈ యంగ్ డైరెక్టర్ ప్రభాస్‌నే డైరెక్ట్ చేయనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అదే యూవీ క్రియేషన్స్‌లో ప్రభాస్ హీరోగా సుజీత్ మరో పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించనున్నాడని ప్రచారం జరిగింది. వాస్తవంగా సాహో సినిమాతో సుజీత్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. మేకింగ్ పరంగా తనని సౌత్ ప్రేక్షకులు, సినిమా ప్రముఖులు మాత్రమే కాకుండా బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా సుజీత్‌ను మెచ్చుకున్నారు. ప్రభాస్ హాలీవుడ్ హీరోగా చూపించాడని..సాహో మేకింగ్ హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తగ్గలేదని చెప్పుకున్నారు.
Prabhas – Sujeeth: ప్రభాస్ అడగగానే పవన్.. సుజీత్‌కు అవకాశం ఇచ్చారట.
కానీ, సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో మళ్ళీ ఇప్పటి వరకు అవకాశం రాలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో మాట్లాడి సుజీత్‌కు అవకాశం ఇప్పించారని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే పవన్ – రానాల భీమ్లా నాయక్ సినిమా వచ్చి సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా వసూళ్ళ సునామీని సృష్ఠిస్తూ అన్నీ చోట్లా బ్రేకీవెన్‌ను టచ్ చేసే దిశగా పరుగులుపెడుతోంది. ఇక ఆయన కొత్తవారికి అవకాశాలిస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. టాలెంటెడ్ అని తెలిస్తే మాత్రం గత సినిమా రిజల్ట్ గురించి కూడా పట్టించుకోకుండా అవకాశమిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ అడగగానే సుజీత్‌కు అవకాశం ఇచ్చారట.