బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కి జంటగా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తుంది. ఇప్పటికే ఈ జంట మీద బాగా క్రేజ్ నెలకొంది. ఇక గతంలో పూజా నాగ చైతన్య తో నటించిన ఒక లైలా కోసం మంచి హిట్ ని అందుకుంది.
ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పిస్తుండగా గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాస్ – వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు సిద్ శ్రీరామ్ పాడిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘మనసా మనసా’ ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకున్నాయి.
ఇక ఈ సినిమాలో ఉన్న లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్ లో అఖిల్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. అక్కినేని అఖిల్ ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశాడు. కాని ఏది హిట్ ఇవ్వలేదు. అయితే ఈ సారి మాత్రం హిట్ పక్కా అని ధీమాగా ఉన్నాడు ఈ అక్కినేని హీరో. అంతేకాదు ఈ సినిమా సక్సస్ అఖిల్ తో పాటు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ కి చాలా కీలకం.
అయితే ఇప్పుడు ఈ సినిమాలో సక్సస్ ట్రాక్ లో ఉంది ఒక్క హీరోయిన్ పూజా హెగ్డే మాత్రమే. ఈ బ్యూటి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి ఫాం లో ఉంది. తన స్టార్ డం వల్ల సినిమాకి బాగా హెల్ప్ అవుతుందన్న నమ్మకంతో యూనిట్ ఉన్నారట. అంతేకాదు పూజా హెగ్డే జంటగా నటించిన హీరోలందరు దాదాపు సక్సస్ లు అందుకున్నారు. దాంతో ఆ రకంగా పూజా సక్సస్ ట్రాక్ అఖిల్ కి ఉపయోగపడుతుందని కూడా భావిస్తున్నారట.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!