Prabhas: ప్రభాస్ ఆదిపురుష్ బడ్జెట్ ఎంతో తెలిస్తే బాలీవుడ్ హీరోలకు నిద్రపట్టదు..ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటున్నారట. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్. ఆయనతో సినిమా తీయాలంటే కనీసం సినిమా బడ్జెట్ 300 కోట్లు కావాల్సిందే. కథ యూనివర్సల్‌గా ఉండాలి. అన్నీ భాషల ప్రేక్షకులను ఆకట్టుకునే కథ..హై టెక్నికల్ వాల్యూస్‌తో నిర్మాత ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా బడ్జెట్ విషయంలో ఆలోచించకుండా ఉండే నిర్మాత దొరకాలి. అలాంటి ప్రాజెక్ట్ అంటే అందరి వల్లా కాదు. అన్నీ అనుకున్నట్టుగా కుదరవు. అందుకే ప్రభాస్ అందరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.
ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఆదిపురుష్ ఒకటి. ప్రభాస్ కెరీర్‌లోనే మొదటిసారి పౌరాణిక కథతో సినిమా చేస్తుండటం విశేషం. ఇక ఇందులో ఆయన రాముడిగా నటిస్తుండటం మరో విశేషం. అంతేకాదు ప్రభాస్ బాలీవుడ్ ఫస్ట్ స్ట్రైట్ మూవీ. అందుకే ఈ సినిమాను బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సైఫ్ అలీఖాన్, కృతీ సనన్ లాంటి క్రేజీ స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అదే ఆదిపురుష్ సినిమా బడ్జెట్.
ఈ సినిమా బడ్జెట్ దాదాపు 500 కోట్లని టాక్ వినిపిస్తోంది. ఇంత బడ్జెట్ ఓ టాలీవుడ్ స్టార్‌తో అంటే బాలీవుడ్ స్టార్ హీరోలకు నిద్రపట్టడం లేదట. ఇక ఈ సినిమాను ఏకంగా 10 భాషలలో 20 వేలకు పైగా థియేటర్స్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఆదిపురుష్ చిత్రాన్ని ఆగస్ట్ 11న రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా జరుగుతోంది. ఇక ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ ఇప్పటికే పూర్తై రిలీజ్‌కు రెడీగా ఉంది. సలార్, ప్రాజెక్ట్ కె సెట్స్ మీదున్నాయి.
దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…
ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…
విభిన్న చిత్రాలకు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. రీసెంట్గా `కార్తికేయ 2`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. 2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్…
విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…
ఒకప్పటి హీరోయిన్ నమిత పండండి కవలలకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సందర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు…