Prabhas: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ బాహుబలి లాంటి భారీ చిత్రం తర్వాత కంప్లీట్‌గా కొత్త పాత్రలను ఎంచుకుంటున్నారు. ఇప్పటి వరకు 5 సినిమాలను కమిటయితే..వాటిలో ఏ రెండు సినిమాలు ఒకే తరహా కథాంశంతో గానీ, జోనర్లో గానీ తెరకెక్కడం లేదు. నిజంగా ప్రభాస్ లైనప్ చాలా డిఫరెంట్‌గా ఉంది. రాధే శ్యామ్
సినిమాలో పామిస్ట్‌గా కనిపించబోతున్న ప్రభాస్, సలార్ సినిమాలో డాన్ పాత్రను పొషిస్తున్నారు. ఇక బాలీవుడ్ స్ట్రైట్ మూవీ ఆదిపురుష్ సినిమాలో ఆయన రాముడి అవతారంలో దర్శనమివ్వబోతున్నారు. ప్రాజెక్ట్ కె సినిమాలో ఏ రోల్ చేస్తున్నారో ఇంకా మేకర్స్ రివీల్ చేయలేదు.
ఇక అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఓ సినిమాను చేయబోతున్నారు ప్రభాస్. ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ – దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఇందులో ప్రభాస్ మొదటిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాతే ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ఇప్పటికే తెలుగులో మెగాస్టార్, వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ, ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, రవితేజ ..ఇలా దాదాపు అందరూ పోలీసు పాత్రలో నటించి మెప్పించారు.
Prabhas: ఆదిపురుష్, సలార్ చిత్రాలు ఈ ఏడాదిలో రిలీజ్..!
మరి మొదటిసారి ప్రభాస్ ఇదే పాత్రలో ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి. ఇక ఈ సినిమాను ఈ ఏడాది ద్వితీయార్థంలో గానీ, లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ సెట్స్ మీదకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాను మార్చి 11వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అలాగే, ఆదిపురుష్, సలార్ చిత్రాలు ఈ ఏడాదిలో రిలీజ్ చేసేందుకు ఆయా చిత్రాల నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్ సాధించుకున్న పాన్ ఇండియా క్రేజ్‌తో దేశ వ్యాప్తంగానే కాకుండా చైనా, జపాన్లలో కూడా అభిమానులను సంపాదించుకున్నారు. అక్కడ ఏర్పడిన అభిమాన సంఘాలు ప్రభాస్ సినిమా రిలీజ్ అంటే చేసే హంగామా అంతా ఇంతా కాదు.