KGF 2: కన్నడలో ఉగ్రం సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఆ తర్వాత యష్ హీరోగా కేజీఎఫ్ ఛాప్టర్ 1 చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకుంది. ఈ సినిమా సౌత్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై అన్నీ భాషలలో పెద్ద కమర్షియల్ సక్సెస్‌లు సాధించింది. దీంతో దర్శకుడిగా ప్రశాంత్ నీల్, హీరో యష్ పాన్ ఇండియన్ స్టార్స్‌గా మారిపోయారు. ఇద్దరికీ వచ్చిన క్రేజ్ అసాధారణం. దాంతో అదే నిర్మాతలు అదే హీరో అదే దర్శకుడు కలిసి కేజీఎఫ్ 1కు సీక్వెల్‌గా కేజీఎఫ్ ఛాప్టర్ 2 చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
గత ఏడాది ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ అసాధారణమైన అంచనాలను పెంచేసింది. కేజీఎఫ్ 1 కంటే కేజీఎఫ్ 2 మరో రేంజ్లో హిట్ సాధిస్తుందన్ని సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అని అందరూ చెప్పుకున్నారు. అయితే కరోనా వేవ్స్ కారణంగా కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా షూటింగ్ దశలో ఆగిపోయింది. ఆ తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ రిలీజ్ పోస్ట్‌పోన్ చేశారు. ఈ లోపు మళ్ళీ కొన్ని సీన్స్ బెంగుళూరులో రీ షూట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు ఓ కొత్త టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్‌ను రీమిక్స్ చేయబోతున్నారట.
KGF 2: షోలే సినిమాలో ‘మెహబూబా మెహబూబా’ సాంగ్‌ను కేజీఎఫ్ 2లో రీమిక్స్..
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ షోలే సినిమాలో ‘మెహబూబా మెహబూబా’ సాంగ్‌ను ఇప్పుడు కేజీఎఫ్ 2లో రీమిక్స్ చేయబోతున్నట్టు తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ సాంగ్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ సాంగ్‌లో స్టెప్పులేసే హాట్ బ్యూటీకి సంబంధించిన అప్డేట్ త్వరలో ఇవ్వబోతున్నారట. అయితే ఈ సాంగ్ టోటల్ ఇండియన్ వెర్షన్‌కు ఫిక్స్ చేసారా లేక సౌత్ వెర్షన్ వరకే ఫిక్స్ చేసారా అనేది తెలియాల్సి ఉంది. శ్రీనిధి హీరోయిన్గా నటిస్తున్న ఇందులో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.