Prashanth Neel – Ram Charan: గత నెలలో వచ్చి భారీ హిట్ సాధించిన పాన్ ఇండియన్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మళ్ళీ అంతకు మించిన అంచనాలు దేశం మొత్తంగా ఉండి ప్రతీ ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో సినిమా ఏదైనా ఉందీ అంటే.. అది ఖచ్చితంగా రాకింగ్ స్టార్ యశ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా ‘కెజియఫ్ 2’ అని చెప్పాలిసిందే. ఈ సినిమాకి దర్శకుడు ప్రశాంత్ నీల్. యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ‘కెజియఫ్ 1’ భారీ సక్సెస్ అందుకోవడంతో ఇప్పుడు ఈ సీక్వెల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ మూవీని కోలార్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించడమే కాకుండా.. చాప్టర్ 2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూసేలా చేసింది. కాగా, కెజియఫ్ చాప్టర్ 2 మూవీని ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ అంతా ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. దీనిలో భాగంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ వరుసగా స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు.
Prashanth Neel – Ram Charan: లిస్ట్‌లో చరణ్ లేకపోవడం షాకిచ్చింది.
అయితే, ప్రశాంత్ నీల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి రివీల్ చేశారు. ప్రస్తుతం ఆయన ‘కెజియఫ్ 2’ చిత్రం తర్వాత ప్రభాస్‌తో చేసే ‘సలార్’ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, దాని తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఒక సినిమాను చేయనున్నట్టు తెలిపారు. ఇది పూర్తైన తర్వాత మొదటి సినిమా ‘ఉగ్రం’ హీరోతో మళ్ళీ ఓ సినిమాను చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత మళ్లీ యశ్‌తోనే ఇంకో సినిమాను ప్లాన్
చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కానీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా ఉంటుందని మాత్రం చెప్పలేదు. ఈ మధ్య అగ్ర నిర్మాత డివివి దానయ్య, చరణ్, ప్రశాంత్ నీల్ కలిసి కొన్ని ఫొటోలలో కనిపించారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ కాంబోలో సినిమా ఉంటుందని భావించారు. కానీ తాజాగా ప్రశాంత్ నీల్ చెప్పిన లిస్ట్‌లో చరణ్ లేకపోవడం షాకిచ్చింది.