Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా తెరకెక్కుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి చిత్రంతో పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ అందుకున్న చరణ్.. తన 15వ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా పూర్తిగా శంకర్ శైలిలో సాగే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే చాసార్లు వార్తలు వచ్చాయి కూడా.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే, తాజాగా చరణ్ ఈ సినిమా నేపథ్యాన్ని రివీల్ చేసేశారు. శంకర్ తో చేస్తున్న ఆర్సీ 15 చిత్ర కథ మన సమాజానికి స్ఫూర్తినిచ్చిన ఎందరో నిజాయితీ కలిగిన అధికారుల మీదే ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ఈ సమాజంలో ఎంతో కొంత భాగం పంచుకోడానికి నా తరువాత సినిమాల్లోనూ ఇలాంటి పాత్రలే చేస్తానని ఈ సందర్భంగా చరణ్ వెల్లడించాడు.
Ram Charan: ఓపెనింగ్ రోజు దీనికి సంబంధించిన పోస్టర్ కూడా వదిలారు.
కాగా, ఈ సినిమాలో చరణ్ రెండు పాత్రల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో వచ్చే తండ్రి పాత్ర అని సమాచారం. దీనికి సంబంధించిన పిక్స్ కొన్ని ఇప్పటికే లీకై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరో పాత్ర రాజకీయాలను ప్రక్షాళన చేసే ఓ ప్రభుత్వోద్యోగి అంటున్నారు. మూవీ ఓపెనింగ్ రోజు దీనికి సంబంధించిన పోస్టర్ కూడా వదిలారు.
అయితే, చరణ్‌ను తండ్రీ కొడులుగా చూపిస్తే, అభిమానులు ఆదరిస్తారా అనేది చూడాలై. గతంలో భారతీయుడు సినిమా కూడా ఇలాగే వచ్చింది. అయితే అప్పుడు కమల్ హాసన్‌కు ఉన్న క్రేజ్ సీనియారిటీ వేరు. కానీ, చరణ్ ఏజ్ మూలంగా చూస్తే డ్యూయల్ రోల్ ఓకే గానీ, తండ్రీ – కొడుకులుగా అంటేనే కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!