రమ్యకృష్ణ బాహుబలి సినిమాలో చేసిన శివగామి పాత్రతో ప్రభాస్ రాణా లకి వచ్చినంత క్రేజ్ వచ్చింది. ఎప్పుడో రజనీకాంత్ నటించిన నరసింహ సినిమాలో చేసిన నీలాంబరి పాత్ర తర్వాత మళ్ళీ అంత కి పదింతలు శక్తివంతమైన పాత్ర శివగామి మాత్రమే. ఈ మధ్యలో ఎన్ని చేసిన వాటికి సరి తూగవని చెప్పాలి. అయితే శివగామి పాత్ర తర్వాత రమ్యకృష్ణ చేసే పాత్రలు ఎంతో జాగ్రత్తగా ఎంచుకుంటూ వస్తుంది.
ఇక గత సంవత్సరం రమ్యకృష్ణ ‘క్వీన్’ వెబ్ సీరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ వెబ్ సీరీస్ కు గౌతమ్ మేనన్, ప్రసత్ మురుగేసన్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సీరీస్ తమిళ నాడు మాజీ ముఖ్యమంత్రి ‘అమ్మ’ జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిందని ముందు నుంచి ప్రచారం జరిగినప్పటికి మేకర్స్ కొట్టిపారేశారు. అదే వాస్తవం కూడా.
అయితే ఈ వెబ్ సీరీస్ సెకండ్ సీజన్ త్వరలో ప్రారంభం కానుందట. ఈ సందర్భంగా రమ్యకృష్ణ అనిత శివకుమారన్ రాసిన ‘క్వీన్’ అనే పుస్తకం ఆధారంగా రూపొందుతోందని…శక్తి శేషాద్రి అనే ఓ బలమైన వ్యక్తిత్వం ఉన్న మహిళ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ కథ తయారైందని ఈ వెబ్ సిరీస్ కి అమ్మ జీవిత కథ కి ఏమాత్రం సంబంధం లేదని తెలిపారు. ఇక రెండవ సీజన్ లో శక్తి శేషాద్రి పాత్ర రాజకీయ నాయకురాలిగా ఎదిగిన విధానం ఉంటుందట.’క్వీన్’ ఓటీటీ లోనే కాకుండా జూన్ 6 నుంచి జీ టీవీ లో కూడా టెలికాస్ట్ కాబోతుంది.