న్యూస్ సినిమా

Rashmika Mandanna: చేతిలో అరడజను సినిమాలున్నా ఇంకా డైలమా..?

Share

Rashmika Mandanna: చేతిలో అరడజను సినిమాలున్నా హీరోయిన్ రష్మిక మందన్న కెరీర్ డైలమాలో ఉందా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం రెండు. సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన పాన్ ఇండియన్ సినిమా పుష్ప 1- 5 భాషలలో భారీ హిట్ సాధించింది. అయితే, ఇక్కడ మెజారిటీ క్రెడిట్ అల్లు అర్జున్ ఆ తర్వాత సుకుమార్‌లకే దక్కింది. ఇక ఐటెం సాంగ్‌తో కొంత సక్సెస్ క్రెడిట్ సమంత దక్కించుకుంది. హీరోయిన్‌గా రష్మికకు దక్కిన క్రేజ్ చాలా తక్కువనే చెప్పాలి.

is rashmika-mandanna career in dilemma
is rashmika-mandanna career in dilemma

పుష్ప ప్రమోషన్స్‌లో తెగ సందడి చేసింది. ఎక్కడ చూసినా ఆ సామీ సామీ సిగ్నేచర్ స్టెప్ వేసి అలరించింది తప్ప రష్మికకు ఓవరాల్‌గా దక్కిన క్రేజ్ మాత్రం అంతంతమాత్రమే. ఇక ఈ సినిమా తర్వాత పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా అడ్రస్ లేకుండా పోయింది. ఈ సినిమా మీద ముందునుంచి కాస్త టాక్ అటు ఇటుగానే ఉంది. సినిమా రిలీజయ్యాక అసలు రష్మికకు ఈ సినిమాతో దక్కిన క్రేజ్ అంటూ ఏమీ లేదు. పుష్ప లాంటి భారీ సక్సెస్ తర్వాత కాస్త అదే రేంజ్ హిట్ పడితే ఇంకోలా ఉండేది.

Rashmika Mandanna: సౌత్‌లో ఎంతవరకు రష్మికకు పేరు తెచ్చిపెడతాయో..?

అదే ఇప్పుడు రష్మిక కెరీర్‌ను కాస్త డైలమాలో వేసినట్టు టాక్ వినిపిస్తోంది. చెప్పుకోవడా నికి 6 సినిమాలు రష్మిక చేతిలో ఉన్నాయి. తెలుగులో పుష్ప 2 ఇప్పట్లో మొదలవదు. అయినా అదెప్పుడొస్తుందో చెప్పలేము. ఇక విజయ్ – వంశీపైడిపల్లి సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది ఇంకా షూటింగ్ మొదలవలేదు. హను రాఘవపూడి దర్శకత్వంలో సీతారామం అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా కథ బావుంటే రష్మికకు బాగానే పేరొస్తుంది. ఇక బాలీవుడ్‌లో మూడు సినిమాలు చేస్తోంది. అవి రిలీజై భారీ హిట్ సాధించిన సౌత్‌లో ఎంత వరకు రష్మికకు పేరు తెచ్చిపెడతాయో చెప్పలేని పరిస్థితి. అందుకే, రష్మికకు తెలుగులో భారీ హిట్ దక్కితే గానీ టాప్ హీరోయిన్‌గా పరిగణించలేరని చెప్పుకుంటున్నారు.


Share

Related posts

మోదీజీ ప‌రువు గోవిందా…. అంత‌ర్జాతీయంగా ఇప్పుడు అదే జ‌రుగుతోందా?

sridhar

రామమందిర నిర్మాణం కోసం నిరీక్షించలేం!

Siva Prasad

Melanoma: పుట్టుమచ్చలు అధికంగా ఉన్నాయా.!? ఇది దేనికి దారితీస్తుందంటే.!?

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar