మెగాస్టార్ చిరంజీవి బ్రేక్ తరువాత ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి, ఆచార్య వంటి సినిమాలలో నటించి అదరగొట్టారు. ఇప్పుడు మరిన్ని సినిమాల్లో లైన్ లో పెట్టారు. ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమాల షూటింగ్స్‌లో బిజీగా వున్నారు. మలయాళం సూపర్ హిట్ సినిమా ‘లుసిఫర్’ ని తెలుగులో రీమేక్ చేసి ‘గాడ్ ఫాదర్’ పేరుతో తెరకెక్కించనున్నారు. మోహన్ రాజా రూపొందిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. చిరు ఈ సినిమాతో పాటు తమిళంలో హిట్ అయిన ‘వేదాళం’ సినిమాని ‘బోళా శంకర్’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మోహన్ రమేష్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా చిరుతో జతకట్టనుంది.
రవితేజ, చిరంజీవి మధ్య ఆ సంబంధం ఏంటి?
అంతేకాకుండా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో కూడా చిరు మరో సినిమా చేస్తున్నాడు. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ సినిమాకి ప్రస్తుతం మెగా 154 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. దీనికి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో మాస్ మహారాజా నటించిన పాత్ర గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఈ సినిమాలో చిరంజీవికి తమ్ముడిగా రవితేజ యాక్ట్ చేయనున్నాడట. విషయం గతంలో తెలుసు కానీ ఇప్పుడు మరొక సరికొత్త ప్రచారం జరుగుతోంది. దాని ప్రకారం, చిరంజీవి సవతి తల్లి కొడుకుగా రవితేజ నటిస్తాడట. అయితే సవతి తల్లికి పుట్టిన రవితేజకి, చిరంజీవికి మధ్య గొడవలు బాగా జరుగుతాయని మీ సర్కిల్లో టాక్ నడుస్తోంది. వారి ఇద్దరి మధ్య సన్నివేశాలు ఊహించలేని ట్విస్ట్‌లతో ప్రేక్షకులను బాగా అలరిస్తాయని అంటున్నారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు వావ్, ఇంత షాక్ కూడా ఇస్తారా అని కామెంట్లు చేస్తున్నారు.
వీరిద్దరి కాంబోలో సినిమా రావడం ఇదేం కొత్తకాదు
రవితేజ, చిరంజీవి కాంబినేషన్లో ‘అన్నయ్య’ అనే సినిమా వచ్చిన విషయం తెలుగు ప్రేక్షకుల అందరికీ తెలుసు. అన్నయ్య సినిమా తరువాత మళ్ళీ ఇంత కాలానికి వీరిద్దరి కాంబోలో కాంబినేషన్ లో మూవీ రావడం అనేది అభిమానులకి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇటీవలే రవితేజ మూవీ సెట్స్ లోకి అడుగు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను సైతం పంచుకున్నారు మూవీ యూనిట్ సభ్యులు. ఈ సినిమాలో సీనియర్ నటి సుమలత రవితేజకు తల్లిగా నటిస్తుందని టాక్.