సినిమా

Mega 154: చిరు సినిమా నుంచి ర‌వితేజ అవుట్‌.. కార‌ణం అదేనా..?

Share

Mega 154: మెగాస్టార్ చిరంజీవి ఇటీవ‌లె `ఆచార్య‌` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను ఏ మాత్రం అందుకోలేక‌పోయింది. ఇదిలా ఉంటే.. చిరంజీవి ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `మెగా 154` ఒక‌టి. కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వం ఈ చిత్రానికి `వాల్తేరు వీరయ్య` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది.

మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ సినిమా.. ఇప్ప‌టికే కొంత షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకుంది. ప‌క్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే ఓ ముఖ్య‌మైన పాత్రలో మాస్ మ‌హారాజ్ ర‌వితేజ న‌టించ‌నున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది.

భారీ రెమ్యున‌రేష‌న్ ఇచ్చి మ‌రీ ఆయ‌న్ను తీసుకున్నార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. కానీ, తాజాగా స‌మాచారం ప్రకారం.. ఈ సినిమా నుంచి ర‌వితేజ అవుట్ అయ్యార‌ట‌. అందుకు కార‌ణం ఆచార్య నే బ‌లంగా టాక్ వినిపిస్తోంది. ఆచార్యకు నెగ‌టివ్ టాక్ రావ‌డంతో.. `మెగా 154`కు హై బడ్జెట్ ను పెట్ట‌లేమ‌ని నిర్మాణ సంస్థ చేతులు ఎత్తేసిందట‌.

దీంతో ద‌ర్శ‌కుడు రవితేజను ఈ సినిమా తప్పించేశాడ‌ట‌. రవితేజకు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చే బదులు ఆ ప్లేస్ లో ఓ యంగ్ హీరోను తీసుకోవ‌డం ఉత్త‌మమైన‌ నిర్ణ‌యమ‌ని భావిస్తున్నార‌ట‌. అందుకే ర‌వితేజను తొల‌గించార‌ని టాక్ న‌డుస్తోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో త్వ‌ర‌లోనే తెలియ‌నుంది.


Share

Related posts

Thaman: థమన్‌కు భారీ ఆఫర్ ఇచ్చిన ప్రభాస్..నిలబెట్టుకుంటాడా..?

GRK

బ్రేకింగ్: మళ్ళీ విషమించిన ఎస్పీ బాలు ఆరోగ్యం!

Vihari

కరోనా వైరస్ సోకిన వాళ్ళే అత్యంత ప్రమాదకరం ..కొరటాల శివ సంచలన వ్యాఖ్యలు

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar