న్యూస్ సినిమా

Raviteja: రవితేజ డిమాండ్స్ కరెక్ట్ కాదా..?

Share

Raviteja: మాస్ మహారాజా రవితేజ వరుస చిత్రాలతో చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రవితేజ గత చిత్రం ‘ఖిలాడీ’ బాగా డిసప్పాయింట్ చేసినా కూడా ఆ ప్రభావం కాస్త కూడా రవితేజ పై పడలేదు. మొదటిసారి రవితేజ తన సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేశాడు. కానీ, అక్కడ ఈ సినిమాను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అల్లు అర్జున్ నటించిన పుష్ప భారీ సక్సెస్ సాధించిన నేపథ్యంలోనే రవితేజ కూడా ఖిలాడి సినిమాను హిందీ వెర్షన్ రిలీజ్ చేసి దెబ్బైపోయాడు.

is raviteja demands correct
is raviteja demands correct

అయితే, ప్రస్తుతం చేస్తున్న సినిమాలను కూడా ఈ మాస్ మహారాజ హిందీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. త్వరలో రామారావు ఆన్‌డ్యూటీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సినిమాకు దర్శకుడు శరత్ మండవ. ఇందులో హీరోయిన్స్‌గా దివ్యాంశ కౌశిక్, రజీష విజయన్ నటిస్తున్నారు. అలాగే, యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ చిత్రాన్ని చేస్తున్నారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘ధమాకా’ వంటి చిత్రాలు దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చాయి.

Raviteja: ఒకవేళ ఆ సినిమాలు హిందీలో బోల్తా పడితే..?

ఇక ఇదే క్రమంలో ఇటీవలే స్టూవర్టు పురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ ఆధారంగా అదే పేరుతో మాస్ మహారాజ మరొక సినిమాను చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను కంప్లీట్ చేస్తున్న రవితేజ హిందీ మార్కెట్‌పై కన్నేసి అక్కడ కూడా ఒకేసారి రిలీజ్ చేయమని నిర్మాతలను అడుగుతున్నారట. వాస్తవంగా అయితే, రవితేజకు హిందీలో మార్కెట్ లేదనే చెప్పాలి. ఈ విషయం ఖిలాడి సినిమాతోనే అర్థమైంది. అయినా కూడా నిర్మాతలను ఒత్తిడి చేస్తున్నాడట. ఒకవేళ ఆ సినిమాలు హిందీలో బోల్తా పడితే ఏంటి పరిస్థితి అని నిర్మాతలు ఆలోచిస్తున్నారట.


Share

Related posts

Pushpa : పుష్ప తర్వాత బన్ని ఫిక్సైందా ఆ డైరెక్టర్‌కేనా..?

GRK

YS Viveka murder case : వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తుపై ఆయన కుమార్తె సునీతా రెడ్డి సీరియస్ కామెంట్స్

somaraju sharma

బ్రేకింగ్: ఏపిలో పంచాయతీ నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar