పాపం రెజీనాను లైంగికంగా వేధిస్తున్నారా ..?రెజీనా కసాండ్ర..టాలీవుడ్ లో మంచి హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. మద్యలో కొంత గ్యాప్ వచ్చినప్పటికి మళ్ళీ వరస సినిమాలలో అవకాశాలను అందుకుంటు సక్సస్ లు తన ఖాతాలో వేసుకుంటుంది. క్రియోటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించిన నక్షత్రం సినిమాతో కనపడకుండా పోయిన రెజీనా మళ్ళీ అడవి శేష్ తో నటించిన ఎవరు సినిమాతో ఫాం లోకి వచ్చింది.
ప్రస్తుతం ‘మిస్టర్ చంద్రమౌళి’ అన్న సినిమాలో నటించింది రెజీనా. గౌతం కార్తీక్ హీరోగా నటించాడు. ఈ సినిమాలో రెజీనా గ్లామర్ డోస్ బాగా పెంచింది. ఇక సినిమా ప్రమోషన్లో భాగంగా రెజీనా తను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయట పెట్టింది. కాలేజ్ డేస్లో కొంత మంది ఆకతాయిలు రెజీనాను లైంగికంగా వేధించారట. ఆ సందర్భంలో ఒకడ్ని చాచి కొట్టిందట కూడా. అయితే ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్న రెజీనా ఇండస్ట్రీలోకి రావాలంటే బాగా ఆలోచించిందట.
అయితే బయట ఉన్నట్టు అందరూ అనుకున్నట్టు ఇండస్ట్రీలో గాని ఇండస్ట్రీ వాళ్ళు గాను తనకు తారసపడలేదని ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయ్యానని వెల్లడించింది. కాస్టింగ్ కౌచ్ తనకి ఇప్పటి వరకు ఎదురవలేదని ఈ సందర్భంగా తెలిపింది. ఇక రెజీనా కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమాలో మెగాస్టార్ తో కలిసి ఒక స్పెషల్ సాంగ్ లో నర్తించింది. ఈ సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతున్నారు. అంతేకాదు ఈ సాంగ్ షూట్ జరిగిన తర్వాత చిరంజీవి నుంచి ఊహించని ప్రశంసలు అందుకుంది.