ఇదేంటి? రామ్ ఉచ్చులో రామ్ అనుకుంటున్నారా?..ఇందులో ఒక రామ్ అంటే రామ్‌గోపాల్ వర్మ, మరో రామ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్‌గోపాల్ వర్మ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కంటే `ఇస్మార్ట్ శంకర్` సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. షాంపెన్ పొంగియడాలు.. బైక్‌లో ట్రిపుల్ రైడ్ చేసుకుంటూ వెళ్లి పోలీసులకు సవాలు ట్రాఫిక్ పోలీసులకు సవాలు విసిరాడు. మొత్తానికి రామ్‌గోపాల్ వర్మ ఇంత రచ్చ చేయడానికి ప్రధాన కారణం.. ఆయన హీరో రామ్‌తో సినిమా చేయాలనుకుంటున్నాడట. అందుకు తన శిష్యుడు పూరి జగన్నాథ్‌ను ఉపయోగించుకుని రామ్‌తో మాట్లాడటం కూడా జరిగిందట. అయతే ప్రస్తుతం ట్రిప్‌లో ఉన్న రామ్ రాగానే తన నిర్ణయం తెలియజేస్తానని చెప్పాడట. అయితే రామ్‌గోపాల్‌వర్మకు సక్సెస్ లేదు. ఆయన సినిమా కథలు ఔట్ డేటెడ్ అయిపోయాయని అందరూ అనుకుంటున్నారు. మరి డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ ఉచ్చులో హీరో రామ్ పడతాడో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే..