RRR: మామూలుగా మన సినిమా ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంటుంది. ఒకసారి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ మళ్ళీ వాయిదా పడితే ఆ సినిమా మీద నెగిటివ్ ప్రచారం మొదలవుతోంది. సినిమాలో ఏదో మైనస్ ఉంది అందుకే దాన్ని మళ్ళీ మళ్ళీ చెక్కుతున్నారు..సీన్స్ రీ షూట్ చేస్తున్నారు. సాంగ్స్ యాడ్ చేస్తున్నారు. కొన్ని సీన్స్ తీసేస్తున్నారు..ఇలాంటి టాక్ వచ్చిందంటే ఇక ఆ సినిమా ఫ్లాప్ అనే గట్టిగా ముద్ర పడిపోతుంది. అలాంటి రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ ఇప్పటికే నాలుగేళ్ళు అవుతోంది. 5 సార్లు పోస్ట్ పోన్ అయింది. దాంతో ఎక్కడో కొందరిలో ఆర్ఆర్ఆర్ సినిమా మీద నెగిటివ్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో రావాల్సిన ఆర్ఆర్ఆర్ మళ్ళీ పోస్ట్ పోన్ అనేసరికి అందరిలో తీవ్ర నిరుత్సాహం మొదలైంది.
అసలు ఈ ఏడాది వస్తుందా అని కొందరు..మళ్ళీ దసరాకే రిలీజ్ అని కొందరూ మాట్లాడు కున్నారు. ఇవన్నీ అసత్య ప్రచారాలు అని మేకర్స్ కొట్టిపారేస్తూ ఇదే నెల 25వ తేదీన రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేథ్యంలో దాదాపు 20 రోజుల ముందు నుంచే యూఎస్‌లో బాక్సాఫీస్ వద్ద అడ్వాన్స్ బుకింగ్ మొదలైపోయింది. గత డిసెంబర్లో బుక్కైన దానికంటే ఇప్పుడు రెట్టింపు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ కావడం రాజమౌళిపై ..ఆయన రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాపై క్రేజ్‌ను తెలియజేస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్.టి.ఆర్, ఆలియా భట్ లాంటి వాళ్ళు ఈ సినిమాలో నటిస్తుండటం కూడా మరో కారణం.
RRR: ఈ రేంజ్ అంటే మామూలు విషయం కాదు.
ఇంత భారీ బడ్జెట్‌తో భారీ స్టార్ కాస్టింగ్‌తో రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా కు యూఎస్‌లో ఇప్పటికే మిలియన్ డాలర్లను దక్కించుకోబోతుండటం విశేషం. కేవలం 20 రోజులుండగానే ఈ రేంజ్ అంటే మామూలు విషయం కాదు. మరి అడ్వాన్స్ బుకింగ్స్ లోనే విదేశాలలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం మొదలైందంటే ఇక వసూళ్ళ పరంగా ఏ రేంజ్ రికార్డ్స్ నమోదవుతాయో..ఎలాంటి కొత్త చరిత్ర రాజమౌళి సృష్ఠించబోతున్నాడో అని అభిమానులతో పాటు ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. చూడాలి మరి ఇన్ని వాయిదాల తర్వాత కూడా క్రేజ్ ఇంచు కూడా తగ్గని ఆర్ఆర్ఆర్ ఎలాంటి హిస్టరీని క్రియేట్ చేస్తుందో. ఇక ఈ సినిమాను డీవీవీ దానయ్య దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.